logo
Published : 02/12/2021 03:49 IST

సిరివెన్నెల కీర్తి శిఖరాయమానం

అనకాపల్లిలోని సిరివెన్నెల ఇంటి వద్ద ఆయన చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే పీలాగోవింద సత్యనారాయణ

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అనకాపల్లిలో పుట్టి చలనచిత్ర రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కీర్తి శిఖరాయమానమని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. గాంధీనగరంలోని సిరివెన్నెల ఇంటి వద్ద బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తెదేపా అర్బన్‌ జిల్లా ఉపాధ్యక్షులు మళ్ల సురేంద్ర, తెదేపా నాయకులు కొణతాల శ్రీనివాసరావు, పచ్చికూర రాము, పోలవరపు త్రినాథ్‌, పిట్లరాజు, దాడి జగన్‌, గోల్డ్‌ వాసు పాల్గొన్నారు.

పట్టణంలోని కళ్యాణి నృత్య అకాడమీ ఆధ్వర్యంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి సంతాప సభ నిర్వహించారు. సంగీత దర్శకులు ఇంద్రగంటి లక్ష్మీ శ్రీనివాస్‌ మాట్లాడుతూ సిరివెన్నెల మృతి సాహితీ లోకానికి, సినీ పరిశ్రమ, అనకాపల్లి వాసులకు తీరని లోటని తెలిపారు. ఆయన పాటలు మనలో చైతన్యాన్ని కలిగిస్తాయన్నారు. కార్యక్రమంలో కొడుకుల శ్రీకాంత్‌, రేబాక మధు, ఫణి కృష్ణ, ఎం.వి.నారాయణ పాల్గొన్నారు. సిద్ధార్ధ సోషల్‌ సర్వీస్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ కార్యాలయంలోనూ సీతారామశాస్త్రి చిత్రపటానికి నివాళులర్పించారు. సంస్థ అధ్యక్షుడు 11 నంది, 4 ఫిలింఫేర్‌ పురస్కారాలు సొంతం చేసుకున్న ఘనత ఆయనదని తెలిపారు.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని