logo
Published : 02/12/2021 03:49 IST

తుపాను ముప్పు ఎదుర్కొనేందుకు సిద్ధం

విశాఖపట్నం, న్యూస్‌టుడే: తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ ఎ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు. బుధవారం సీపీ మనీష్‌కుమార్‌ సిన్హాతో కలిసి సన్నద్ధతపై సమీక్షించారు. ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకు తుపాను ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, వైద్య ఆరోగ్య, ఇంజినీరింగ్‌ శాఖలతో పాటు అన్ని శాఖల అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.   వ్యవసాయశాస్త్రవేత్తల సూచనలను రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు చేరవేయాలన్నారు. ముంపునకు గురయ్యే ప్రాంతాల్లోని ఆనకట్టల వద్ద ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బలగాలను ఉంచాలన్నారు. గాలుల తీవ్రతకు చెట్లుకూలే ప్రమాదం ఉన్నందున మర రంపాలు, జేసీబీలను సిద్ధం చేసుకోవాలన్నారు. మత్స్యకారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందజేసి అప్రమత్తం చేయాలన్నారు.

కొవిడ్‌ వేరియంట్‌ ఒమిక్రాన్‌ హెచ్చరికలతో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ మల్లికార్జున అధికారులను ఆదేశించారు. హోమ్‌ ఐసొలేషన్‌ కిట్లు త్వరలో రానున్నాయని, 74 ఆసుపత్రులు, 7500 పడకలను సిద్ధం చేశామని చెప్పారు. నర్సీపట్నం, అనకాపల్లి, పాడేరుల్లో ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేయాలన్నారు. ఈనెల 15 నాటికి పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్‌ పూర్తయ్యేలా చూడాలన్నారు. నాలుగు లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఆయా సమీక్ష సమావేశాల్లో జేసీ అరుణ్‌బాబు, ఎస్పీ కృష్ణారావు, కమిషనర్‌ లక్ష్మీశ, డీఆర్వో శ్రీనివాసమూర్తి, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని