logo
Published : 02 Dec 2021 03:49 IST

ఆన్‌లైన్‌లో విద్యార్థినికి రూ.1.5 లక్షల టోకరా

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: ఆ న్‌లైన్‌లో వ్యాపార లావాదేవీల ద్వారా రోజూ రూ. 700 నుంచి రూ.1200 వరకు సంపాదించవచ్చని ఎస్‌ఎంఎస్‌ పంపి డిగ్రీ విద్యార్థిని నుంచి రూ. లక్షన్నర కాజేసిన వైనమిది. అనకాపల్లి పట్టణ సీఐ ఎల్‌.భాస్కరరావు తెలిపిన వివరాల ప్రకారం అనకాపల్లిలోని విజయరామరాజు పేటకు చెందిన యువతి గాజువాకలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది. ఈమె ఫోన్‌కు గతనెల 9న ఒక సూక్ష్మసందేశం వచ్చింది. దీంట్లో రోజుకి రూ. 700 నుంచి రూ. 1500 వరకు సంపాదించవచ్చని వివరాలు ఉన్నాయి. దీంతో సందేశం వచ్చిన నంబరుకు విద్యార్థిని ఫోన్‌ చేయగా ఒక మహిళ మాట్లాడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఇక నుంచి వాట్సాప్‌లో సందేశాల మాత్రమే వస్తాయని చెప్పారని, తరవాత ఫ్లిప్‌కార్ట్‌ సర్వీసు నుంచి కాల్‌ చేస్తున్నామంటూ క్రోమ్‌లో ఒక లింక్‌ను పంపారని తెలిపింది. దాన్ని ఓపెన్‌ చేయగా ముందుగా రూ. 500 రీఛార్జ్‌ చేయమనగా గతనెల 10న తాను ఫోన్‌పే చేశానని విద్యార్థిని తెలిపింది. ప్రొడక్ట్‌ వాల్యూ ఎక్కువ ఉందని చెప్పగా మరో రూ. 500 పంపానని, అనంతరం దఫదఫాలుగా డబ్బులు పంపినట్లు ఫిర్యాదులో పేర్కొంది. మరుసటి రోజు ఫోన్‌ పే పనిచేయడం లేదని పేటీఎం ద్వారా నగదు పంపితే ముందు పంపిన డబ్బులతో కలసి తిరిగి వచ్చేస్తాయని నమ్మించారని తెలిపింది. ఇలా రూ. 1.56 లక్షల వరకు నగదును పంపి చివరికి మోసపోయినట్లు గుర్తించి బాధిత విద్యార్థిని పట్టణ పోలీసులను ఆశ్రయించింది. బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ భాస్కరరావు తెలిపారు.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని