logo
Published : 02/12/2021 03:49 IST

తరలివచ్చిన యువశక్తి

పోటీదారుల సరదా.. ఓ స్వీయ చిత్రం

ఈనాడు, విశాఖపట్నం, ఏయూ ప్రాంగణం:  దక్షిణభారత నైపుణ్యపోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం విశాఖలోని ఏయూ కన్వెన్షన్‌ కేంద్రంలో బుధవారం ఘనంగా జరిగింది. ఐ.టి., నైపుణ్యాభివృద్ధి, శిక్షణశాఖ మంత్రి గౌతంరెడ్డి ఆయా పోటీలను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాల నుంచి యువత పాల్గొనగా మరికొన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి ట్రాక్‌-2, 3 కేటగిరీల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. ప్రాంగణం బయట థింసా నృత్యం ప్రదర్శించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినవారు వేదిక ముందు మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహించారు. 2019లో రష్యాలో జరిగిన పోటీల్లో ‘మెడలియన్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ’ అవార్డు పొందిన తెలంగాణకు చెందిన కోటేశ్వరరెడ్డి కార్యక్రమానికి వచ్చిన వారితో ప్రతిజ్ఞ చేయించారు. ‘అంకితభావంతో పోటీల్లో పాల్గొంటానని, మోసం చేయనని, మంచి ప్రతిభ కనబరుస్తానని, మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తా’నని పోటీలకు హాజరైనవారు ప్రతిజ్ఞ చేశారు. వారికి నగరంలోని 11 కేంద్రాల్లో, 52 విభాగాల్లో పోటీలు నిర్వహించి ఈనెల నాలుగో తేదీన విజేతలకు బహుమతులు అందజేస్తారు.

ఆంధ్రప్రదేశ్‌ యువతతో మంత్రి గౌతంరెడ్డి

విశాఖలో నైపుణ్య వర్సిటీ: విశాఖపట్నంలో నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నామని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. విశాఖపట్నం అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి దృఢ సంకల్పంతో ఉన్నారన్నారు. హైటెక్‌ స్కిల్‌ యూనివర్సిటీ విశాఖలో, మోడరేట్‌ స్కిల్లింగ్‌ వర్సిటీ తిరుపతిలో పెట్టనున్నామన్నారు. ఎవరైనా పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేస్తే 26 రోజుల్లో అన్ని అనుమతులు ఇస్తామని తెలిపారు. కొంతమంది భూములు తీసుకొని పరిశ్రమలు నెలకొల్పకపోవడం వలనే పనుల్లో జాప్యం కనిపిస్తోందన్నారు.

 

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని