logo
Published : 02/12/2021 03:49 IST

కక్షలకు ముగ్గురి బలి

అనంతగిరి, న్యూస్‌టుడే: పాత కక్షల నేపథ్యంలో రెండు కుటుంబాల మధ్య తలెత్తిన కొట్లాటలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందడం కలకలం సృష్టించింది. అరకులోయ సీఐ దేముడుబాబు, స్థానికుల కథనం ప్రకారం.. అనంతగిరి మండలంలోని టోకూరు పంచాయతీ బగ్మార్‌వలస గ్రామానికి చెందిన గొల్లోరి డొంబు, కిల్లో కొమటీ కుటుంబాలకు మధ్య చాలాకాలం నుంచి గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాలు బుధవారం మరోసారి ఘర్షణకు దిగారు. కోపోద్రిక్తుడైన డొంబు కుమారుడు సుబ్బారావు.. కిల్లో కొమటీ (48), ఆయన కుమారులు భగవాన్‌, బలరాంపై కత్తితో దాడి చేశాడు. కొమటీ అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆగ్రహానికి గురైన కొమటీ కుటుంబీకులు సుబ్బారావును చితకబాదారు. ఈ ముగ్గురినీ 108 అంబులెన్సులో అనంతగిరి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సుబ్బారావు మృతి చెందగా.. మిగతా ఇద్దరిని విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. ఇంతలో డొంబు అక్కడ కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు వెతికారు. గ్రామ శివార్లో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. కొమటీ బంధువులే డొంబును కొట్టి చంపారని బంధువులు ఆరోపిస్తున్నారు. సంఘటనాస్థలాన్ని సీఐ పరిశీలించారు.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని