logo
Published : 02 Dec 2021 04:34 IST

పట్టాలు తప్పిన గూడ్స్‌

ఆలస్యంగా నడిచిన పలు రైళ్లు

పక్కకు ఒరిగిన బోగీ... 

గాజువాక, రైల్వేస్టేషన్‌, న్యూస్‌టుడే: విశాఖపట్నంలోని గంగవరం పోర్టుకు ఖాళీ బోగీలతో వెళ్తున్న గూడ్స్‌ రైలు బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో దువ్వాడ రైల్వేస్టేషన్‌ సమీపంలోని జగ్గరాజుపేట వద్ద పట్టాలు తప్పింది. ఒక బోగీ నేలకొరకగా, మరోకటి పక్కకు ఒరిగిపోయింది. విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ట్రాక్‌పై ఈ ఘటన జరిగింది. అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. విజయవాడ వైపు వెళ్లే రైళ్లను విశాఖ రైల్వేస్టేషన్లో నిలుపుదల చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. రాత్రి 11 తర్వాత పలు రైళ్లు ఆలస్యంగా నడిపారు.

రైళ్ల ఆలస్యంతో విశాఖ రైలు నిలయంలో ఉన్న ప్రయాణికులు


అమృత్‌సర్‌ ఎక్స్‌ప్రెస్‌ రద్దు

రైల్వేస్టేషన్‌, న్యూస్‌టుడే: సౌత్‌ ఈస్ట్‌కోస్ట్‌ సెంట్రల్‌ రైల్వే బిలాస్‌పూర్‌ డివిజన్‌లో ఛాంప-ఝార్షుగుడ సెక్షన్‌లో భద్రతా పరమైన  ఆధునికీకరణ పనుల నేపథ్యంలో ఈనెల 6,9 తేదీల్లో విశాఖ-అమృత్‌సర్‌ (20807), 8,11 తేదీల్లో అమృత్‌సర్‌- విశాఖ (20808) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఎ.కె.త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. అదే విధంగా ఝార్షుగుడ గూడ్స్‌ యార్డుల్లో ఆధునికీకరణ పనుల వల్ల ఈ నెల 2  నుంచి 5 వరకు రవుర్కెలా- జగదల్‌పూర్‌- రవురర్కెలా (18107-18108) రైలును రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని