logo
Published : 02/12/2021 04:34 IST

సహజ అందాలు.. చూసొద్దాం..

కట్టిపడేసే సుందర ప్రదేశాలు
పెరుగుతున్న పర్యటకుల సంఖ్య
గ్రామీణభీమిలి, తగరపువలస, న్యూస్‌టుడే

వంజంగి హిల్స్‌

సహజసిద్ధ అందాలకు విశాఖ జిల్లాకు ఎంతో పేరు. అటు ముచ్చటగొలిపే మన్యంలోని అందాలు, ఇటు సువిశాల విశాఖ-భీమిలి సాగర తీరం సొగసుల నడుమ అంతర్జాతీయ గమ్య నగరంగా పేరొందిన సుందర నగరం. కరోనాతో రెండేళ్లుగా తగ్గిన పర్యటక తాకిడి క్రమంగా ఊపందుకుంటోంది. జిల్లాకు దేశ విదేశాల నుంచి కొత్త పర్యటకులు అధిక సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రసిద్ధ పర్యటక, దర్శనీయ స్థలాలపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

కటిక వాటర్‌ పాల్స్‌


లంబసింగి
విశాఖ నుంచి దూరం: 125 కిమీ
రవాణా: విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి నర్సీపట్నం మీదుగా వాహనాల్లో చేరుకోవచ్చు. ఏపీటీడీసీ బస్సులను అద్దెకు ఇస్తుంది.
విశేషం: చింతపల్లి మండలం సముద్రమట్టానికి 3వేల అడుగుల ఎత్తులో ఉంది. అతి శీతలంగా ఉండే ఈ ప్రాంతం ఆంధ్రా కాశ్మీర్‌గా పేరొందింది. ఈ సీజన్‌లో సూర్యోదయానికి ముందే ఇక్కడి ప్రకృతి రమణీయతను చూసి తరించాలి. దీంతో పాటు ఇక్కడికి సమీపంలోనే ఉన్న తాజంగి జలాశయం, మంచుఅందాలతో కనువిందు చేసే చెరువులవేనం, కొత్తపల్లి జలపాతం, వంజంగి హిల్స్‌ చూసి రావచ్చు.
వసతి: లంబసింగిలో ఆంధ్రప్రదేశ్‌ పర్యటకాభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ)కి చెందిన నాలుగు గదులు ఉన్నాయి. ప్రయివేటు గదులు అందుబాటులో ఉన్నాయి.

రుషికొండ బీచ్‌


అరకులోయ (ఆంధ్రా ఊటీ)
దూరం: 120 కిమీ
రవాణా: విశాఖ కాంప్లెక్స్‌ నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రయివేటు వాహనాల్లో చేరుకోవచ్చు. ఏపీటీడీసీ బస్సులు కూడా ప్రతిరోజూ వెళ్తుంటాయి.
విశేషం: పసుపు వర్ణంలో వలిసెపూల తోటలు పర్యటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. పద్మావతిగార్డెన్స్‌, గిరిజన ప్రదర్శనశాల ప్రత్యేక ఆకర్షణ. గాలికొండ వ్యూ పాయింటు ఔరా అనిసిస్తోంది. ఇక్కడికి కొద్దిదూరంలో డుంబ్రిగూడ మండలంలోని చాపరాయి జలపాతం ఉంది.
వసతి: అరకులోయలో ఏపీటీడీసీ మయూరిలో 88 గదులు, హరితలో 56 గదులు ఉన్నాయి. ప్రయివేటు వసతి లభిస్తుంది.


ఎర్రమట్టి దిబ్బలు, భీమిలి బీచ్‌, తొట్లకొండ
దూరం:  విశాఖ-భీమిలి బీచ్‌రోడ్డులో నగరం నుంచి తొట్లకొండ 18కిమీ, ఎర్రమట్టిదిబ్బలు 25 కిమీ, భీమిలి 27కిమీ దూరంలో ఉన్నాయి.
రవాణా: 900కె బస్సులు, పర్యటక బస్సులు, కార్లు, ఆటోలు, జీపులు
విశేషం:  తొట్లకొండపై బౌద్ధ కట్టడాలు  ఉంటాయి. సమీపంలో సహసిద్ధమైన ఎర్రమట్టిదిబ్బలు, భీమిలి బీచ్‌, గోస్తనీ నది సాగర సంగమం, డచ్‌ సమాధులున్నాయి.    
వసతి: ఎర్రమట్టి దిబ్బలకు సమీపంలో రెస్టారెంట్‌ ఉంది. భీమిలిలో ప్రయివేటు హోటళ్లు, గదులు లభిస్తాయి. తొట్లకొండ దిగువన బీచ్‌కి సమీపంలో రెస్టారెంట్‌, గదులు ఉన్నాయి  


కైలాసగిరి, రుషికొండ బీచ్‌, జంతుప్రదర్శనశాల, ఆర్కేబీచ్‌
రవాణా: ఇవన్నీ నగరంలోనే ఉన్నాయి. ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి బస్సులు, ఆటోలు ఉన్నాయి. అరగంట వ్యవధిలో ఈ ప్రదేశాలకు చేరుకోవచ్చు. నగరానికి 20కిమీ దూరంలో గాజువాక ప్రాంతానికి సమీపంలో యారాడ బీచ్‌ ఉంది.
వసతి: నగరంలోని అప్పుఘర్‌ ప్రాంతంలో కైలాసగిరికి సమీపంలో 56 గదులతో ఏపీటీడీసీ యాత్రినివాస్‌ ఉంది.


బొర్రా గుహలు
దూరం:  95 కిమీ
రవాణా: విశాఖ నుంచి ఆర్టీసీ, టూరిజం బస్సులు, ప్రయివేటు వాహనాలు ఉన్నాయి. విశాఖ నుంచి కిరండూల్‌ వెళ్లే రైలు బొర్రాగుహలు మీదుగా అరకు వెళ్తుంది.
విశేషం: సహజసిద్ధంగా ఏర్పడిన గుహలు ఇవి. సమీపంలోని అనంతగిరి ప్లాంటేషన్‌, టైడా జంగిల్‌ బెల్స్‌, కటిక జలపాతం ఆకర్షణగా నిలుస్తాయి.
వసతి: అనంతగిరి హిల్‌ రిసార్ట్‌లో 28 గదులు, టైడాలో 28 గదులు ఉన్నాయి.

బొర్రాగుహలో పర్యటకులు


సమాచారానికి సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు
ఏపీ పర్యటకాభివృద్ధి సంస్థ డివిజినల్‌ మేనేజరు-88979 28844

జిల్లా పర్యటకశాఖాధికారిణి-63099 42026
వెబ్‌సైట్‌లు: www.aptdc.in www.aptourism.ap.gov.in


పర్యటక సమాచార కేంద్రాలు

-బాపూజీ (ఏపీటీడీసీ డీవీఎం)
ఆయా సీజన్‌ను బట్టి టూర్‌ ప్యాకేజీలు సిద్ధం చేస్తున్నాం. విశాఖ ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్‌, వీఎంఆర్‌డీఏ భవన్‌లోని మూడో అంతస్థులో ఏర్పాటు చేసిన పర్యటక సమాచార కేంద్రాలు ఉదయం ఆరు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ పనిచేస్తాయి. లంబసింగి, అరకు, అనంతగిరి, అప్పుఘర్‌, టైడాలో ఏపీటీడీసీ గదులు, రెస్టారెంట్లు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చు. విశాఖ-అరకు మధ్య అద్దాల రైలును ఇటీవల ఉపరాష్ట్రపతి ప్రారంభించారు.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని