logo
Published : 02/12/2021 04:34 IST

అంతర్జాతీయ స్థాయిలో.. సత్తా చాటేలా..!

యువత నైపుణ్యాల వృద్ధికి సహకారం
‘ఇండియా స్కిల్స్‌’ సంచాలకులు ప్రకాశ్‌శర్మ

-ఈనాడు, విశాఖపట్నం

దేశంలోని మానవ వనరుల్లో నైపుణ్యాలు అంతర్జాతీయ స్థాయికి చేరాలనే లక్ష్యంతో ‘ఇండియా స్కిల్స్‌’ పోటీలను నిర్వహిస్తోందని ఆ సంస్థ సంచాలకుడు ప్రకాశ్‌శర్మ పేర్కొన్నారు. విశాఖలో నాలుగు రోజుల పాటు జరిగే పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో విశాఖ వచ్చిన ఆయన ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు.   

ప్రతి ఒక్కరూ చదువుతోపాటు ఏదోరంగంలో మంచి నైపుణ్యం సంపాదించుకోవాలి. అది వారి ఆర్థిక స్వావలంబనకు పునాదులు వేసి ఆర్థిక భరోసాను కల్పిస్తుంది. మహాత్మాగాంధీ కూడా నేతపనిలో విశేషమైన నైపుణ్యం సంపాదించారు. యువత ఏం చేయాలన్నది ఆయన ఆనాడే చాటి చెప్పారు’ అని పేర్కొన్నారు. ఇంకా ఏమన్నారంటే...

చదువుతో సంబంధం లేదు:  ఇండియా స్కిల్స్‌ జిల్లా, రాష్ట్ర, ప్రాంతీయ, జాతీయ స్థాయిల్లో పోటీలను నిర్వహిస్తోంది. ఈ ఏడాది సుమారు 2.50లక్షల మంది ప్రాథమికంగా దరఖాస్తు చేసుకున్నారు. పోటీల్లో పాల్గొనేవారికి అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలతో నైపుణ్యాలను ప్రదర్శించడం ఎలాగన్న విషయంపై స్పష్టమైన అవగాహన వస్తుంది. ఈ పోటీల్లో పాల్గొనేవారికి చదువుతో సంబంధం లేదు.  కొన్ని నైపుణ్య విభాగాలకు 21 సంవత్సరాలు, కొన్నింటికి 23 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి. ‘స్కిల్స్‌ ఇండియా’ అంతర్జాల చిరునామాలో రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే పోటీలకు ఆహ్వానిస్తారు. కశ్మీర్‌లో 12 ఏళ్ల బాలుడు కూడా పాల్గొని మొబైల్‌ రోబోటిక్స్‌ విభాగంలో సత్తా చాటాడు.

కేంద్ర ప్రభుత్వ నిధులతోనే: జాతీయ స్థాయిలో విజేతలుగా నిలిచిన వారిని అంతర్జాతీయ పోటీలు ఎక్కడ జరిగినా కేంద్రప్రభుత్వ నిధులతో తీసుకెళ్తాం. సుమారు 50 నైపుణ్యాల విభాగాల నుంచి 50 మంది పాల్గొంటారు.  2011 నుంచి అంతర్జాతీయ పోటీలకు యువత వెళుతున్నారు. ఫలితంగా వివిధ రంగాల్లో అంతర్జాతీయస్థాయి నైపుణ్యాలు ఏ స్థాయిలో ఉంటున్నాయన్న అంశంపై వారిలో అవగాహన కలుగుతోంది. 82 దేశాలు ఈ పోటీల్లో భాగస్వామ్యం అవుతున్నాయి. జాతీయ స్థాయిలో విజేతలుగా నిలిచిన వారికి అంతర్జాతీయ శిక్షణ ఇచ్చిన తరువాతే ఆ పోటీలకు పంపుతున్నాం. ఫలితంగా వారిలో నైపుణ్యాలు మరింత మెరుగవుతున్నాయి. అందుకే  వారికి ప్రముఖ సంస్థల్లో మంచి వేతనాలతో ఉద్యోగాలు సైతం లభిస్తున్నాయి. పలువురు సొంతగా వ్యాపారాలను కూడా ప్రారంభించు కోగలుగుతున్నారు.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని