logo
Published : 02/12/2021 04:34 IST

చిత్ర వార్తలు

కొమ్మ విరిగే...వాహనాలు వెనుతిరిగే

గురుజాడ కళాక్షేత్రం సమీపంలో రహదారిపై బుధవారం ఉదయం ఓ భారీ చెట్టు కొమ్మ అడ్డంగా పడింది. దీంతో రాకపోకలకు అంతరాయంగా ఏర్పడింది. చిన్న వాహనాలు ఆ పక్క నుంచే వెళ్లినా...పెద్దవాహన చోదకులు మాత్రం వెనక్కి వెళ్లి మరో మార్గం చూసుకున్నారు.

- ఈనాడు, విశాఖపట్నం


ఇదో.. మాయాబ‘జారు’

హార్బరు సమీపంలో సముద్ర కెరటాల తీవ్రతకు నేల కోసుకుపోకుండా అడ్డుగా భారీ రాళ్లు వేసిన ప్రాంతం చూసేందుకు ఎంతో బాగుంటుంది. అందుకే ఆ రాళ్లపై నిత్యం ఎందరో ఫొటోలు తీసుకుంటుంటారు. కానీ, కొన్ని రాళ్లు నాచుపట్టి ఉన్నాయి. ఏ మాత్రం జాగ్రత్తగా లేకున్నా జారిపడిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ ముప్పే అని తెలిసినా యువతీయువకులు గజిబిజి రాళ్లపైనే సెల్ఫీలు దిగుతుండటం గమనార్హం.

-ఈనాడు, విశాఖపట్నం


పశుపతి నాథేశ్వరుడికి... రుద్రాక్షల అలంకరణ

కార్తికమాసం పురస్కరించుకుని ఎండాడలోని మహా గౌరీ సమేత పశుపతి నాథేశ్వరుడికి బుధవారం ప్రత్యేక అభిషేకాల అనంతరం లక్ష రుద్రాక్షలతో విశేషంగా అలంకరించారు. మధ్యాహ్నం నుంచి మహాలింగార్చన చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి పలు వంట  కాలతో నైవేద్యం సమర్పించారు.

-న్యూస్‌టుడే, ఎండాడ


కాపాడాలంటే తొయ్యాల్సిందే

ప్రాణాలను కాపాడే 108 వాహనాలూ మొరాయిస్తున్నాయి. వాటిని పరిగెత్తించడానికి అందులో పనిచేస్తున్న సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. నాలుగు నెలల కిందట దేవరాపల్లికి పాత వాహనాన్నే కేటాయించారు. వారం నుంచి ఇంజిను సమస్యతో ముందుకు కదలడం లేదు. అత్యవసరమని ఫోను కాల్‌ వస్తే అక్కడ అందుబాటులో ఉన్నవారిని కాస్త తొయ్యండని సిబ్బంది బతిమలాడి వాహనాన్ని స్టార్టు చెయ్యాల్సి వస్తోంది.

- న్యూస్‌టుడే, దేవరాపల్లి


ఇక రోజూ థింసా థింసారే

ఆంధ్రా ఊటీ అరకులోయ సందర్శనకు వచ్చే పర్యటకులకు గిరిజన సంప్రదాయ నృత్యం థింసా రోజూ కనువిందు చేయనుంది. అరకులోయ గిరిజన మ్యూజియం ఆవరణలో గతంలో శని, ఆదివారాల్లోనే ఈ ప్రదర్శనను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పర్యటక సీజన్‌ కావడంతో రోజూ సాయంత్రం  5.30 గంటల నుంచి థింసా నృత్య ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మ్యూజియం మేనేజర్‌ మురళి తెలిపారు.

- అరకులోయ, న్యూస్‌టుడే

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని