logo
Published : 04/12/2021 02:25 IST

కేంద్రాలిలా.. రక్షణ ఎలా?

అధ్వానంగా తుపాను రక్షిత కేంద్రాలు

అచ్యుతాపురం, న్యూస్‌టుడే

బాలుర వసతిగృహంగా మారిన కొండపాలెం తుపాను భవనం

జిల్లాలో 11 మండలాల పరిధిలోని తీర గ్రామాల్లో తెదేపా ప్రభుత్వ హయాంలో బహుళ ప్రయోజన తుపాను భవనాలు నిర్మించారు. ఒక్కో భవనానికి రూ.1.50 కోట్లు ఖర్చు చేశారు. భవనాల నిర్వహణ బాధ్యతలను స్థానికంగా కమిటీలకు అప్పగించారు. ఇంతవరకు బాగానే ఉన్నా జిల్లాలో నిర్మించిన ఏ భవనం నిర్వహణను పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. రాష్ట్రంలోనే అతిపెద్ద మత్స్యకార గ్రామమైన పూడిమడకలో నాలుగు బహుళ ప్రయోజన తుపాను భవనాలు నిర్మించారు. వీటిలో ఒక భవనాన్ని ప్రైవేటు పరిశ్రమ నిర్వహించే ఆసుపత్రికి అధికారులు కేటాయించారు. మరో భవనంలో సచివాలయం నిర్వహిస్తున్నారు.

తుపాన్లు అనుకోని విధంగా దాడిచేస్తే ప్రాణ నష్టం జరగకుండా ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుచేసి బహుళ ప్రయోజన తుపాను భవనాలు నిర్మించింది. గతంలో మాదిరిగా కాకుండా ఆధునిక సౌకర్యాలను కల్పిస్తూ వీటిని నిర్మించారు. అయితే దాదాపుగా ఇవన్నీ నిర్వహణ లోపంతో అధ్వానంగా మారాయి.

అప్రమత్తతతో సరి..

జవాద్‌ తుపాను ముంచుకొస్తుందని అప్రమత్తం చేయడం తప్ప ప్రత్యామ్నాయ అవసరాలకు వినియోగిస్తున్న తుపాను రక్షిత భవనాలను ఖాళీచేయించలేదు. ఎక్కడా జనరేటర్లు, ఇతర పరికరాలను సిద్ధంగా ఉంచలేదు. రాంబిల్లి మండలంలో నిర్మించిన భవనాలు సైతం ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారీ వర్షాలకు జిల్లాలో మొదట ముంపునకు గురయ్యే ఈ మండలంలోనూ అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే ఏర్పాట్లును అధికారులు చేయలేదు. పూడిమడకలో నిర్మించిన అన్ని భవనాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

తీరాన్ని ఆనుకొని ఉన్న భవనంలో బీసీ వసతిగృహాన్ని నిర్వహిస్తున్నారు. నిర్మించిన భవనాలన్నీ ఏదో ఒక రంగంగా వినియోగిస్తున్నారు. ప్రజలు తలదాచుకోవడానికి వీలులేకుండా వీటి రూపాన్ని సైతం మార్చేశారు. వాడపాలెంలో నిర్మించిన రెండు భవనాలకు నిర్వహణలోపం కనిపిస్తోంది.

భవనాలను ఖాళీ చేయించకుండా నిర్మాణంలో ఉన్న సచివాలయాలు, పూడిమడక ఉన్నత పాఠశాల, హరిపాలెం హైస్కూల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడానికి వాటిని స్వాధీనం చేసుకున్నారు. తుపాను భవనాలు ఇతర అవసరాలకు వినియోగిస్తే ఎలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

 

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని