logo
Published : 04/12/2021 02:25 IST

చింతపల్లి కేంద్రంగా పూల ఎగుమతులు

పంటలను పరిశీలిస్తున్న ఇన్‌ఛార్జి ఏడీఆర్‌ భరతలక్ష్మి

చింతపల్లి, న్యూస్‌టుడే: చింతపల్లి కేంద్రంగా పర్యటకులను ఆకర్షించేలా వివిధ రకాల పూల వనాలు సాగు చేయడంతో పాటు ఎగుమతులకు వీలుగా వాటిని సిద్ధం చేయాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఇన్‌ఛార్జి ఏడీఆర్‌ డాక్టర్‌ భరతలక్ష్మి అన్నారు. పరిశోధనా స్థానంలో సాగవుతున్న వివిధ రకాల పూలు, పంటల సరళిని శుక్రవారం ఆమె పరిశీలించారు. మన్య ప్రాంత వాతావరణానికి అనుగుణంగా శీతాకాలంలో తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడికి రావడంతో పాటు, ఆకర్షణీయంగా ఉండే వివిధ రకాల అలంకరణ పూల సాగును చేయాలని సూచించారు. పరిశోధన క్షేత్రంలో సాగవుతున్న చైనా ఆస్టర్‌ పూల మొక్కలు పరిశీలించారు. పర్యటకులకు తక్కువ ధరలకు వీటిని విక్రయించేలా ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. చిన్నగెడ్డ, చౌడుపల్లి ప్రాంతాల్లో పర్యటించిన ఏడీఆర్‌.. ప్రస్తుత తుపాను నేపథ్యంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. శాస్త్రవేత్తలు డాక్టర్‌ సీతారాం, సందీప్‌నాయక్‌, జోగారావు, వినయ్‌కుమార్‌, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని