logo
Published : 04/12/2021 02:25 IST

వేర్వేరు ఘటనల్లో ఇద్దరి బలవన్మరణం

ఉరేసుకున్న పదో తరగతి విద్యార్థి

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అనకాపల్లిలో పదోతరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఉరేసేుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణ పోలీస్‌స్టేషన్‌ ఏఎస్సై అప్పారావు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని దేవీనగర్‌కి చెందిన దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు (17) పదో తరగతి చదువుతున్నాడు. కొద్దిరోజులుగా ఇతని మానసిక స్థితి బాగుండటం లేదు. గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. ఈ మేరకు తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై శుక్రవారం పట్టణ ఎస్సై సతీష్‌ కేసు నమోదు చేశారు.


వెదుళ్లపాలెంలో గుర్తుతెలియని వ్యక్తి..

ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి

నక్కపల్లి, న్యూస్‌టుడే: వెదుళ్లపాలెం సమీపంలో గుర్తుతెలియని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదనపు ఎస్సై ఎంవీ రమణ తెలిపిన వివరాల ప్రకారం.. జాతీయ రహదారి నుంచి వెదుళ్లపాలెం వెళ్లే మార్గంలో ఓ చెట్టు కొమ్మకు సుమారు 45 ఏళ్ల వయసున్న వ్యక్తి ఉరేసుకున్నట్లు శుక్రవారం సాయంత్రం పోలీసులకు సమాచారం వచ్చింది. సీఐ నారాయణరావు, ఎస్సై సిబ్బందితో అక్కడకు చేరుకుని పరిశీలించారు. నీలం రంగు జీన్‌ ప్యాంటు, బూడిద రంగు టీషర్ట్‌ ధరించి ఉన్నాడన్నారు.


ట్రాక్టరు పైనుంచి పడి ఒకరి మృతి

సింహాచలంనాయుడు

మాడుగుల,న్యూస్‌టుడే: సత్యవరానికి చెందిన సీహెచ్‌ సింహాచలంనాయుడు అనే వ్యక్తి శుక్రవారం ట్రాక్టరులో వరిచేను వేస్తూ జారి పడిన ఘటనలో మృతి చెందాడని ఎస్సై. పి.రామారావు తెలిపారు. వెంటనే అతనిని స్థానిక ఆసుపత్రికి తీసుకువచ్చినా ఫలితం లేకపోయిందన్నారు. దీనిపై కేసు నమోదు చేశామన్నారు.


 

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని