logo
Published : 04/12/2021 02:25 IST

తీరంలో ఈదురు గాలులు

పూడిమడకలో కెరటాల ఉద్ధృతి

ఆందోళనలో మత్స్యకారులు

పూడిమడకలో సన్నద్ధతపై మాట్లాడుతున్న తహసీల్దార్‌ రాంబాయి

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: జవాద్‌ తుపాను ప్రభావంతో తీరప్రాంత గ్రామాలైన పూడిమడక, తంతడి-వాడపాలెం మత్స్యకారులు వణికిపోతున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి తీరానికి రాక్షస కెరటాల ఉద్ధృతి ప్రారంభం కావడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. పడవలు కొట్టుకుపోకుండా ఉండేందుకు మత్స్యకారులు తాళ్లతో తీరంలో ఉండే చెట్లకు కట్టారు. వలలను తీరానికి దూరంగా తరలించారు.

అంతా నిర్మానుష్యం

పాయకరావుపేట : తుపాను నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తమయ్యారు. అధికారులు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేయడంతో వేటకు వెళ్లలేదు. పడవలను ఒడ్డుకు చేర్చారు. పెంటకోట నుంచి పాల్మన్‌పేట వరకు తీరం నిర్మానుష్యంగా మారింది. నిత్యం మత్స్యకారులు, సందర్శకులతో రద్దీగా కనిపించే తీరం బోసిపోయింది.

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో గోవిందరావు సూచించారు. చాకలిపేట, పాండురంగస్వామి కోవెల వెనుక ప్రాంతాల్లో శుక్రవారం పర్యటించారు. తాండవ నుంచి వరద నీటి కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతాల్లోని వారికి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. తహసీల్దారు అంబేడ్కర్‌, ఈవోఆర్డీ వెంకటనారాయణ, ఎంఈవో కె.ఎన్‌.గాంధీ, జలవనరుల శాఖ జేఈ లోకేష్‌ వెంట ఉన్నారు.

పూడిమడక గ్రామం వద్ద అలలు తీరాన్ని తాకుతుండటంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. మత్స్యకారులెవ్వరూ సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని తహసీల్దార్‌ రాంబాయి దండోరా వేయించారు.

మత్స్యకార గ్రామాల్లో పర్యటించి వారిని అప్రమత్తం చేశారు. సంప్రదాయ మత్స్యకారులు లోపలికి వెళ్లకుండా మెరైన్‌, అచ్యుతాపురం ఎస్సైలు మల్లేశ్వరరావు, ఉపేంద్ర సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.

పూడిమడక సచివాలయాలతో పాటు ఉన్నత పాఠశాల ఆవరణలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్‌ రాంబాయి తెలిపారు. పూడిమడకలో ఎంపీడీఓ కృష్ణ పర్యటించి పరిస్థితిని తెలుసుకున్నారు.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని