logo
Published : 04/12/2021 03:05 IST

అన్నదాతల్లో కలవరం

బలిఘట్టంలో పొలంలోనే ఉంచేసిన వరి పనలు

నర్సీపట్నం అర్బన్‌, ఎస్‌.రాయవరం, న్యూస్‌టుడే: ఆరుగాలం చెమటోడ్చి పండించిన వరి పంట ముంపునకు గురికాకుండా కాపాడుకునేందుకు రైతులు పొలాల వెంబడి పరుగులు తీస్తున్నారు. నర్సీపట్నం మండలంలో ఇప్పటికి ఐదు శాతమే వరి కోతలు పూర్తయ్యాయి. పనలన్నీ పొలంలోనే ఉన్నాయి. వ్యవసాయ సిబ్బంది గ్రామాలకు వెళ్లి రైతులను అప్రమత్తం చేయడంతో చాలామంది కుప్పలు వేస్తున్నారు. బలిఘట్టం, పెదబొడ్డేపల్లిలో కొన్నిచోట్ల పనలను పొలంలోనే ఉంచడం కనిపించింది. ఎస్‌.రాయవరంలో ఈ ఖరీఫ్‌లో 9600 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ప్రస్తుతం అన్ని చోట్లా కోతలకు సన్నద్ధమయ్యారు.

తాత్కాలిక బసకు ఏర్పాట్లు

పంచాయతీ కార్యదర్శులు నీళ్ల కుండీలను నింపి సిద్ధంగా ఉంచుకున్నారు. విద్యుత్తు అవాంతరాలు ఎదురైతే నీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా జనరేటర్లను ఏర్పాటు చేశారు. నర్సీపట్నం పురపాలక సంఘంలో 17 సచివాలయాల సిబ్బందిని కమిషనర్‌ అప్రమత్తం చేశారు. ముంపు సమస్య ఎదురైతే బాధితులను పాఠశాలల భవనాల్లో తాత్కాలికంగా ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. జలాశయాల నీటిమట్టాలపై జలవనరుల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తున్నారు.

ఈ సమయంలో తుపాను భయం రైతులను కలవరపెడుతోంది. కొందరు అప్రమత్తమై కోసిన వరి పనులను ఇళ్లకు తరలించగా, మరికొందరు మెట్ట ప్రాంతాల్లో కుప్పలు పెడుతున్నారు. తుపాను భయంతో కోత కోసిన మూడు రోజులకే నూర్పిడి చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని