logo
Published : 04/12/2021 03:05 IST

ప్రమాదస్థాయికి పెద్దేరు తాండవ నీటి విడుదల

మాడుగుల, న్యూస్‌టుడే: జాలంపల్లి శివారు రావిపాలెం వద్ద పెద్దేరు జలాశయం ప్రమాద స్థాయికి చేరుకుంది. జలాశయం పూర్తి నిల్వ సామర్థ్యం 137 మీటర్లు కాగా ప్రస్తుతం 136.35 మీటర్లకు చేరింది. ఎగువ నుంచి 125 క్యూసెక్కుల నీరు చేరుతోంది. మరికొంత వరద నీరు చేరితే గేట్లు ఎత్తే అవకాశం ఉందని ఏఈ సుధాకరరెడ్డి తెలిపారు.

నాతవరం, న్యూస్‌టుడే: తాండవ జలాశయం నుంచి 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు డీఈ రాజేంద్రకుమార్‌ పేర్కొన్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 380 అడుగులు కాగా ప్రస్తుతం 378 అడుగుల వరకు నీరుందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వచ్చే అవకాశం ఉన్నందున తాండవ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. ఆర్డీవో గోవిందరావు తుని ప్రధాన రహదారిలో వెదుళ్లగెడ్డను పరిశీలించారు. తహసీల్దారు జానికమ్మ సరుగుడు, గుమ్ముడుగొండ గ్రామాల్లో పర్యటించి రైతులను అప్రమత్తం చేశారు.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని