logo
Updated : 04/12/2021 04:11 IST

భళా.. సేంద్రియ మేళా!

సేంద్రియ సాగు కరపత్రికలను ఆవిష్కరిస్తున్న నాబార్డు ఛైర్మన్‌ గోవిందరాజులు, తదితరులు

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే: రసాయన ఎరువులు లేకుండా సేంద్రియ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేస్తున్న ఉత్పత్తులను కొనుగోలు చేసి, రైతులను ప్రోత్సహించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఎంవీపీకాలనీ ఆళ్వార్‌దాస్‌ మైదానంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విశాఖ ఆర్గానిక్‌ మేళా శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. సుమారు 100కిపైగా స్టాళ్లు ఏర్పాటు చేసి, వాటిలో వందల సంఖ్యలో సేంద్రియ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు. ప్రధానంగా చిరుధాన్యాలు (సామలు, అరికలు, ఊదలు, కొర్రలు, అండుకొర్రలు, జొన్నలు, గంటెలు), పప్పు ధాన్యాలు, కంది, మినప, పెసర, జునుగులు, బఠాని, కొమ్ము శనగలు, వేరుశనగ, చెరకు, బెల్లం, బెల్లం తేనె, బెల్లంపొడి, కూరగాయలు వంకాయ, ఆనప, చిక్కుడు, టమోటా, బెండ, పాలకూర, చుక్కకూర, గోంగూర, బచ్చలికూర, అరటికాయ, బొప్పాయి, చిరుధాన్యాలతో చేసిన లడ్డూలు, జంతికలు, పూతరేకులు, ఇతర ఆహార ఉత్పత్తులు, ఆయుర్వేద మందులు, వివిధ రకాల ఔషధ, ఇళ్లలో పెంచుకునే మొక్కలు, మిద్దెతోటకు అవసరమైన పరికరాలు, సేంద్రియ రంగులు ఉపయోగించి తయారుచేసిన దుస్తులు, పలు ఆయుర్వేద మొక్కలు తదితర వాటిని ప్రదర్శనలో ఉంచారు.

ఉత్పత్తుల వివరాలు తెలుసుకుంటున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ మాధవ్‌, తదితరులు

* రైతు సమ్మేళనంలో భాగంగా పలువురికి పురస్కారాలు ప్రదానం చేశారు. తూర్పు గోదావరి నుంచి ఎం.వీరారెడ్డి, ఎ.నర్సింగరావు, పి.వి.అప్పాజీ, విశాఖ జిల్లా నుంచి నాళం సుబ్బారావు, లాలం శ్రీనివాస్‌, సి.హెచ్‌.రాము, విజయనగరానికి చెందిన హనుమంత్‌రాజు, శేషకుమారి, పద్మ, శ్రీకాకుళం నుంచి దామోదర్‌, శ్యామలకు వీటిని అందించారు. సేంద్రియ సాగుకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలైన పారినాయుడు(జట్టు-విజయనగరం), భూదేవి(ఆదివాసీ శ్రీకాకుళం), మిద్దె తోటల విభాగంలో కె.మంగపతిరావు, అరుణ, డాక్టర్‌ కె.రామకృష్ణ, పరిశోధకులు నాగేంద్రప్రసాద్‌తో పాటు కొంతమంది మీడియా ప్రతినిధులకు అవార్డులు ప్రదానం చేశారు. మేళా కమిటీ అధ్యక్షులు పి.ఎల్‌.ఎన్‌.రాజు, ఉపాధ్యక్షులు ఉషా, జి.ఎస్‌.ఎన్‌.రాజు, కార్యదర్శులు యుగంధర్‌రెడ్డి, జె.వి.రత్నంలు పర్యవేక్షించారు. ఈ ప్రదర్శన శని, ఆదివారాల్లో జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని