logo
Updated : 04/12/2021 04:10 IST

మార్గశిర మాసోత్సవాలకు.. విస్తృత ఏర్పాట్లు

సమావేశంలో ఈఓ మాధవి, డీఈఈ రమణ, అధికారులు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేశామని ఆలయ ఈఓ ఎస్‌.జె. మాధవి తెలిపారు. శుక్రవారం ఆలయ ఆవరణలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆదివారం నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయని, ఈ ఏడాది నాలుగు గురువారాలు వచ్చాయని, చివరి వారం మహా అన్నదానం నిర్వహిస్తామ న్నారు. భక్తులు ఉదయం 7 నుంచి 10గంటల లోపు రావాలని, రూ.20, రూ.100, రూ.200 టిక్కెట్లపై వచ్చే వారికి వేర్వేరుగా క్యూలైన్లు ఉన్నాయని వివరించారు.

వారికి అనుమతి లేదు: ప్రసాదాల విక్రయ కౌంటర్లు పెంచుతున్నామని, భక్తులకు అన్నప్రసాదం అందజేస్తామని ఈవో పేర్కొన్నారు. 26న వేదసభ, అర్చక సదస్సు, 30న సహస్రఘటాభిషేకం నిర్వహిస్తామన్నారు. మాస్కు ఉంటేనే భక్తులను అనుమతిస్తామని, 65ఏళ్లు పైబడిన వారు, 10ఏళ్ల లోపు చిన్నారులను అనుమతించబోమన్నారు. విద్యుత్తు దీపాలతో ఆలయాన్ని అలంకరిస్తామని, గురువారాల్లో పూలతో అలంకరించనున్నట్లు చెప్పారు. అనంతరం ఉత్సవాల ఆహ్వాన పత్రికలను ఈఓ, ఇతర అధికారులు విడుదల చేశారు. సమావేశంలో డీఈఈ సిహెచ్‌.వి.రమణ, పర్యవేక్షకులు అప్పలనర్సింహరాజు, తనిఖీదారు పి.నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని