logo
Published : 04/12/2021 03:05 IST

శరవేగంగా ప్రత్యామ్నాయ నౌకా స్థావరం

దృష్టిసారించిన తూర్పు నౌకాదళం

ఈనాడు, విశాఖపట్నం

తూర్పునౌకాదళం ప్రత్యామ్నాయ నౌకాస్థావరాన్ని సాధ్యమైనంత వేగంగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. రాంబిల్లిలో అత్యాధునిక వసతులతో దీనిని నిర్మిస్తున్నారు. దేశ భద్రతలో అత్యంత కీలకంగా తూర్పునౌకాదళం ఆవిర్భవిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న నౌకాదళ స్థావరానికి మించిన భద్రత ఏర్పాట్లతో రాంబిల్లిలో నిర్మాణాలు మొదలయ్యాయి. డిసెంబరు నాలుగున నౌకాదళ దినోత్సవం నేపథ్యంలో నేవీ అధికారులు శుక్రవారం తమ సమరాంగణ శక్తిని ప్రత్యేక సమావేశంలో వివరించారు.

* తూర్పునౌకాదళంలో నాలుగు జలాంతర్గాములున్నాయి. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐ.ఎన్‌.ఎస్‌.అరిహంత్‌ను విశాఖలోనే మోహరించారు. ఆ శ్రేణిలో ఇది మొదటిది.

* రానున్న రోజుల్లో అందుబాటులోకి తీసుకు రానున్న జలాంతర్గాములను మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దుతున్నారు. తూర్పుతీరంలో మరింత నిఘా పెంచేలా తమిళనాడులోని అరక్కోణం కేంద్రంగా అధునాతన పీ8ఐ నిఘా విమానాన్ని వినియోగిస్తున్నారు. మరో నాలుగు పీ8ఐ నిఘా యుద్ధవిమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. హిందుస్థాన్‌ ఎరోనాటిక్స్‌ లిమిటెడ్‌ సంస్థ తయారుచేసిన ‘అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలీకాప్టర్స్‌’(ఎ.ఎల్‌.హెచ్‌) వినియోగాన్ని కూడా తూర్పునౌకాదళం ప్రారంభించింది. ఇటీవలే వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం వాటి వినియోగ సరళిని పరిశీలిస్తున్నారు.

* ఐ.ఎన్‌.ఎస్‌.విక్రాంత్‌ విమాన వాహక యుద్ధనౌకను కూడా విశాఖలోనే మోహరించనున్నారు. కొచ్చిలోని షిప్‌యార్డ్‌లో దాని నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. వచ్చే సంవత్సరం తూర్పునౌకాదళానికి అప్పగించనున్నారు. తూర్పునౌకాదళంలో సుమారు 50 వరకు అన్ని రకాల యుద్ధనౌకలు అందుబాటులో ఉన్నాయి. వీటి రక్షణకు కూడా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దిల్లీ శ్రేణి యుద్ధనౌకలు(దిల్లీ, మైసూర్‌, ముంబై యుద్ధనౌకలు) ఇకపై విశాఖ కేంద్రంగా కొనసాగుతాయని పేర్కొన్నారు.

నివాళి కార్యక్రమం రద్ధు

అమరులైన యుద్ధవీరులకు ఏటా డిసెంబరు నాలుగో తేదీన బీచ్‌రోడ్‌లోని ‘విక్టరీ ఎట్‌ సీ’ స్తూపం దగ్గర నివాళి అర్పిస్తుంటారు. నౌకాదళ దినోత్సవం నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు. యుద్ధ విన్యాసాలు, నౌకలకు విద్యుద్దీపాలంకరణ చేసి తీరంలో ఉంచే కార్యక్రమం కూడా రద్దు చేశారు.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని