logo
Updated : 04/12/2021 03:06 IST

నర్సీపట్నం ఈఓ టీఎన్‌ఎస్‌ శర్మ సస్పెన్షన్‌

వన్‌టౌన్, న్యూస్‌టుడే: నర్సీపట్నం గ్రూపు-2 ఆలయాల ఈఓ టీఎన్‌ఎస్‌ శర్మను సస్పెండ్‌ చేస్తూ దేవాదాయశాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. నర్సీపట్నం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ నిధుల్లో రూ.28,811 దుర్వినియోగం చేశారని, హుండీల ద్వారా వచ్చిన రూ.51వేలు బ్యాంకులో డిపాజిట్‌ చేయడంలో వైఫల్యం చెందారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నట్లు కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆరోపణలపై విచారణ కూడా చేయనున్నారు. శర్మ బాధ్యతలను ఎలమంచిలి డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తక్షణమే ఆయా ఉత్తర్వులు అమలయ్యేలా చూడాలని విశాఖ ప్రాంత ఉప కమిషనర్‌ శ్రీనివాసరెడ్డిని ఆదేశించారు.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని