logo
Updated : 04/12/2021 04:10 IST

‘పద్దు’ తలకిందులు!

అరకొరగా గ్రాంట్లు, ప్రత్యేక నిధులు

జీవీఎంసీ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరం

న్యూస్‌టుడే, కార్పొరేషన్‌

మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) ఆర్థిక పరిస్థితి తలకిందులవుతోంది. 2021-2022 ఏడాది బడ్జెట్‌(పద్దు) రూ.4255.35 కోట్లు అనుకున్నా.. దానికి దగ్గరగా రావడం లేదని సమాచారం.

జీవీఎంసీ సమకూర్చుకునే వాటితోపాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ద్వారా నిధులు వస్తాయన్న అంచనాతో ఈ బడ్జెట్‌ రూపొందించారు. అయితే ఆర్థిక సంఘం నిధులు, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక, ఆకర్షణీయ ప్రాజెక్టులు, ఏడీబీ (ఏసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు), బ్యాంకు రుణాలు జీవీఎంసీ ఖాతాకు జమ అవ్వాల్సి ఉండగా, ప్రభుత్వం విడుదల చేయలేదు. ఫలితంగా బడ్జెట్‌ అంచనాలు తప్ఫి. జీవీఎంసీ ఆర్థిక పరిస్థితిని ప్రశ్నార్థకం చేసింది.

* వాస్తవాలకు దూరంగా: జీవీఎంసీకి వివిధ పద్దుల రూపంలో రూ.వేల కోట్లు వస్తాయని బడ్జెట్‌లో చూపగా, వాస్తవంగా అంత మొత్తంలో నిధులు రాలేదు. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు రూ.80కోట్లు ఇవ్వలేమని చేతులెత్తేసింది. సిటీస్‌ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.13 కోట్లు కూడా ఇవ్వలేమనడంతో జీవీఎంసీ సర్దుబాటు చేయాల్సి వచ్చింది.

* వచ్చింది కొంతే: 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.100 కోట్లు వస్తాయని అంచనా వేయగా, ఇప్పటి వరకు రూ.15 కోట్లు మాత్రమే వచ్చాయి. స్మార్ట్‌ సిటీకి రూ.160 కోట్లు రావాల్సి ఉన్నా రూ.80 కోట్లు, అమృత్‌కు రూ.60 కోట్లకు గాను రూ.15 కోట్లు మాత్రమే వచ్చాయి.

అలా చెప్పినా: మూడేళ్ల కిందట పనులు పూర్తి చేసిన గుత్తేదారులకు ఇప్పటికీ బకాయిలు తీర్చకపోవడం సమస్యగా మారింది. స్థానిక సంస్థల నిధులు ఆయా పట్టణాలు, మున్సిపాలిటీలే వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామని మంత్రులు ప్రకటించినా అమలు కాకపోవడంతో స్థానిక సంస్థల్లో అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయి. జీవీఎంసీ ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకుని గుత్తేదారులు టెండర్లు వేయడానికి ముందుకు రావడంలేదు. గతంలో టెండర్లు ఆహ్వానించిన వెంటనే పోటీపడి పనులు దక్కించుకునేవారు. ప్రస్తుతం ఆరు, ఏడు సార్లు పిలిచినా స్పందించడం లేదు.

ఆశించినంత రాక: నగర వాసులు చెల్లిస్తున్న అన్ని పన్నులు సుమారు రూ.760 కోట్లు నేరుగా ప్రభుత్వానికి చేరుతున్నాయి. 010 పద్దు కింద శాశ్వత, పొరుగు, ఒప్పంద కార్మికులకు ప్రభుత్వం వేతనాలిస్తోంది. కానీ అనుకున్న స్థాయిలో నిధులు మళ్లీ జీవీఎంసీకి రావడం లేదు.

వార్షిక ఆదాయం ఇలా...

ఆస్తి పన్ను: రూ.340 కోట్లు

నీటి ఛార్జీల రూపేణా: రూ.180 కోట్లు

పట్టణ ప్రణాళిక ద్వారా: రూ.140 కోట్లు

డీఅండ్‌ఓ ట్రేడ్‌, ప్రకటనలు తదితరాలు: రూ.100 కోట్లు

వ్యయం ఇలా...

మంచినీటి నీటి సరఫరాకు: రూ.140 కోట్లు

చెత్త సేకరణ, రవాణాకు: రూ.200 కోట్లు

విద్యుత్తు బిల్లులు: రూ.48కోటు్ల

కార్యాలయాల నిర్వహణ, డీజిల్‌కు: రూ.60 కోట్లు

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని