logo
Published : 05/12/2021 05:06 IST

తప్పిన జువాద్ ముప్పు

ఈనాడు, విశాఖపట్నం

జవాద్‌ తుపాను గండం ఇక దాదాపు లేనట్లే. బంగాళా ఖాతంలో విశాఖకు సమీపంగా వస్తూనే దిశను మార్చుకొని ఒడిశా వైపు వెళ్లడంతో ముప్పు తప్పినట్లయింది. దీంతో నగర ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. శనివారం మాత్రం చలిగాలుల ప్రభావం కనిపించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడ్డారు. తీరం వెంట 45 కి.మీ. నుంచి 65 కి.మీ.వేగంతో గాలులు వీచాయి.

● శనివారం రాత్రి జిల్లాలో 40.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. భీమిలిలో 15.8 , ఆనందపురం 11.4, పద్మనాభం 3.4 మి.మీ. వర్షం పడింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక అక్కడక్కడ మరింత ప్రభావం కనిపించింది. ఆ సమయంలో విద్యుత్తు సరఫరాలో కొంత అంతరాయం ఏర్పడింది. రుషికొండ, భీమిలిలో సముద్రం అలజడిగా కనిపించింది. తుపాను ఆదివారానికి వాయుగుండంగా మారడంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండొచ్చని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలియజేసింది. కొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలుంటాయంది. ఈ సమయంలో గాలులు బలంగా వీచే అవకాశం ఉండొచ్చంటున్నారు.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని