logo

గమ్య నగరి నుంచి.. తిరుమల గిరికి!

ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) విశాఖ- తిరుపతి ప్యాకేజీని పునరుద్ధరించింది. జనవరి నుంచి టిక్కెట్లు బుక్‌ చేసుకునే అవకాశం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. కొవిడ్‌కు ముందు ఈ ప్రత్యేక ప్యాకేజీ నిర్వహించేవారు. తరువాత తాత్కాలికంగా నిలిపేశారు.

Published : 05 Dec 2021 05:06 IST

విశాఖ-తిరుపతి ప్యాకేజీ పునరుద్ధరణ

ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) విశాఖ- తిరుపతి ప్యాకేజీని పునరుద్ధరించింది. జనవరి నుంచి టిక్కెట్లు బుక్‌ చేసుకునే అవకాశం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. కొవిడ్‌కు ముందు ఈ ప్రత్యేక ప్యాకేజీ నిర్వహించేవారు. తరువాత తాత్కాలికంగా నిలిపేశారు. దీనిపై సెప్టెంబరు ఒకటిన ‘ఆ బస్సుల్లో బస భలే’ శీర్షికతో ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన అధికారులు తాజాగా ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చారు. రవాణా సదుపాయంతో పాటు తిరుపతిలో స్వామి దర్శనం, బస ఏర్పాటు, ఆతిథ్య సేవలు పర్యాటశాఖే చూసుకునే అవకాశం ఉండటంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. గమ్యనగరిగా పేర్కొనే విశాఖ నుంచి ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతికి పెద్ద సంఖ్యలోనే వెళ్లేవారు.

● ఇలా అమలు: వారంలో బుధ, శుక్ర, శనివారాల్లో ఈ ప్యాకేజీ అమలు చేయనున్నట్లు వెబ్‌సైట్లో పేర్కొన్నారు. రెండు రాత్రులు, మూడు పగళ్లు ఉండేలా ప్రణాళిక చేశారు. విశాఖ నుంచి బస్సు బయలు దేరుతుంది. పాయకరావుపేట వరకూ ప్రయాణికులను ఎక్కించుకుంటారు. రాజమహేంద్రవరం, విజయవాడలోనూ సేవలను వినియోగించుకోవచ్ఛు

● బస్సులు ఎలా: ప్యాకేజీని పునరుద్ధరించడం వరకూ బాగానే ఉన్నా.... ఏ బస్సులు వినియోగిస్తారనేది ప్రశ్నార్థకంగా ఉంది. గతంలో వినియోగించిన వోల్వోలు ప్రస్తుతం లేవు. ఒకటున్నా సాంకేతిక సమస్యలతో రోడ్డెక్కటం లేదు. గతంలో తిరుపతి ప్యాకేజీ కోసం ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ 44 సీట్లు కలిగిన రెండు వోల్వో బస్సులను విశాఖకు కేటాయించింది. వాటిల్లో ఒకటి అప్పుడే వెనక్కు తీసుకున్నారు. కొద్ది రోజులు ఒక బస్సుతో నెట్టుకొచ్చారు. ఏడు నెలలుగా దానిని నడపడంలేదు. అపరాధ రుసుం చెల్లించి రోడ్డు ఎక్కించాలని చూస్తున్నారు. నెలలుగా తిప్పకపోవడంతో దాని సామర్థ్యాన్ని తనిఖీ చేయాల్సి ఉంది. చిన్నపాటి సమస్యలు, సాంకేతిక ఇబ్బందులు పరిష్కరించాలి. దీనికి అదనంగా మరికొంత వ్యయం అయ్యే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని