logo
Published : 05/12/2021 05:06 IST

చెత్త సేకరణ రుసుము వడ్డింపు తథ్యం?!

మురికివాడల్లోని ప్రజలపై మరో భారం

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: మురికివాడల్లో చెత్త సేకరణ ఛార్జీల వసూలుకు జీవీఎంసీ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ఈనెల 10న నిర్వహించనున్న పాలకవర్గ సమావేశంలో 26 అంశాలతో అజెండాను రూపొందించి శనివారం కార్పొరేటర్లకు అందజేశారు. అందులో ఈ అంశాన్ని కూడా చేర్చారు. మురికివాడల్లో నివసిస్తున్న ప్రజల నుంచి చెత్త సేకరణ ఛార్జీలు వసూలు చేయబోమని గతంలో మేయరు ప్రకటించారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా రూ.60లు వసూలు చేయాలని ప్రతిపాదించడం గమనార్హం.కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల ఈ సమావేశంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

అజెండాలో మరికొన్ని ఇలా..: జీవీఎంసీ కోర్టు కేసులకు సంబంధించి మున్సిపల్‌ స్టాండింగ్‌ కౌన్సెల్‌ లీగల్‌ ఫీజులు పెంచడం. ● 6వ వార్డు ఎంఎస్‌ఆర్‌ లేఅవుట్‌లో రూ. 65.63లక్షల వ్యయంతో సీతాకోక చిలుక థీమ్‌పార్కు నిర్మాణం. ● అభివృద్ధి పనులకు కొత్త ఎస్‌ఎస్‌ఆర్‌ ధరలను అమలు చేయడం. ● దేవాలయాలు, ప్రార్థనా స్థలాలకు ఉచితంగా మంచినీటి కుళాయి కనెక్షన్లు. ● బీఆర్‌టీఎస్‌ నుంచి శారదా పీఠం వరకు రహదారి విస్తరణ. ● వెంకటాపురం కూడలి నుంచి రైల్వే వంతెన వరకు సీసీ రహదారి నిర్మాణం ● జ్ఞానాపురం పరిసరాల్లో భూగర్భ మురుగునీటి కనెక్షన్లు.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని