logo

హౌస్‌ వైరింగ్‌లో ఉచిత శిక్షణ

అనకాపల్లిలోని భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జిల్లా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఈ నెల 14 నుంచి నిరుద్యోగ యువకులకు నెల రోజుల హౌస్‌ వైరింగ్‌ కోర్సు ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభం కానుందని ఆ సంస్థ సంచాలకుడు పి.జయరాజు తెలిపారు.

Published : 05 Dec 2021 05:36 IST

కొత్తూరు(అనకాపల్లి), న్యూస్‌టుడే: అనకాపల్లిలోని భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జిల్లా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఈ నెల 14 నుంచి నిరుద్యోగ యువకులకు నెల రోజుల హౌస్‌ వైరింగ్‌ కోర్సు ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభం కానుందని ఆ సంస్థ సంచాలకుడు పి.జయరాజు తెలిపారు. ఉచితంగా శిక్షణతో పాటు భోజన, వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. ఉచితంగా ఏకరూపు దుస్తులు, టూల్‌ కిట్‌లను అందజేస్తామన్నారు. శిక్షణ పూర్తయిన అభ్యర్థులకు ధ్రువపత్రాలను అందజేయడంతో పాటు ఉద్యోగ, ఉపాధి కల్పనకు సహకరిస్తామన్నారు. అలాగే అర్హులకు బ్యాంకు రుణాలను మంజూరు చేయిస్తామన్నారు. పదోతరగతి చదివిన గ్రామీణ జిల్లాకు చెందిన యువకులు దరఖాస్తులను అనకాపల్లి ఆర్టీసీ బస్‌ స్టేషన్‌ సమీపంలో పూడిమడక రహదారిలో మార్గంలో పీఎస్‌ఎం ప్లాజాలో ఉన్న కార్యాలయంలో అందజేయాలన్నారు. పూర్తి సమాచారానికి కార్యాలయ పనివేళల్లో ఫోన్‌ సంఖ్య 80083 33509 లో సంప్రదించొచ్చని ఆయన తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని