logo

మండలానికిరెండు పీహెచ్‌సీలు

ప్రతి మండలంలో రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండేలా వైద్యారోగ్య శాఖ ప్రణాళిక చేస్తోంది. ప్రస్తుతమున్న 88 పీహెచ్‌సీలకు అదనంగా మూడు పీహెచ్‌సీలను మంజూరు చేశారు.

Published : 05 Dec 2021 05:50 IST

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: ప్రతి మండలంలో రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండేలా వైద్యారోగ్య శాఖ ప్రణాళిక చేస్తోంది. ప్రస్తుతమున్న 88 పీహెచ్‌సీలకు అదనంగా మూడు పీహెచ్‌సీలను మంజూరు చేశారు. ఆనందపురం మండలం శొంఠ్యాం, పద్మనాభం మండలం రెడ్డిపల్లి, గొలుగొండ మండలంలోని చీడిగుమ్మలలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో వీటి నిర్మాణానికి అవసరమైన స్థలాలను రెవెన్యూ అధికారులు గుర్తించారు. త్వరలో వీటిని వైద్యారోగ్య శాఖకు అప్పగించనున్నారు. ఆసుపత్రులకు సంబంధించిన పీఎఫ్‌ఎంఎస్‌తో అనుసంధానించేలా యూనియన్‌ బ్యాంకులో కొత్తగా ఖాతాలు తెరుస్తున్నట్లు డీఎంహెచ్‌వో తిరుపతిరావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని