logo

చెరకు రైతుల బకాయిలు చెల్లించేలా చూడాలి

జిల్లాలోని నాలుగు చక్కెర కర్మాగారాల్లో రైతులకు రావల్సిన బకాయిలు తక్షణమే చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును కోరినట్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట నగేష్‌ తెలిపారు. విజయవాడలో శనివారం వీర్రాజును

Published : 05 Dec 2021 05:50 IST

సోము వీర్రాజుకు వినతిపత్రం ఇస్తున్న నగేష్‌

నక్కపల్లి, న్యూస్‌టుడే: జిల్లాలోని నాలుగు చక్కెర కర్మాగారాల్లో రైతులకు రావల్సిన బకాయిలు తక్షణమే చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును కోరినట్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట నగేష్‌ తెలిపారు. విజయవాడలో శనివారం వీర్రాజును కలిసిన ఆయన ఈమేరకు వినతిపత్రం అందించారు. ఈ వివరాలను పేటలో విలేకరులకు తెలిపారు. తాండవ, ఏటికొప్పాక కర్మాగారాలు మూతపడేలా ఉన్నాయని, ఇదే జరిగితే రైతులు అన్యాయమవుతారని పేర్కొన్నారు. తక్షణమే వారికి రావాల్సిన బకాయిలు ఇవ్వడంతో పాటు, కర్మాగారాల మనుగడ కొనసాగేలా పార్టీ తరఫున ప్రభుత్వంతో మాట్లాడాలన్నారు. దీనిపై విజయవాడలో జరుగుతున్న పార్టీ కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేయించినట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని