logo

..ఇంకా అప్రమత్తంగానే

 హుద్‌హుద్‌ తుపాను అనుభవాలను గుర్తుకు తెచ్చుకుని పూడిమడక మత్స్యకారులు శనివారం కూడా ఆందోళనగానే ఉన్నారు. తుపాను ప్రభావం తొలగిపోలేదని రెవెన్యూ, పోలీసు అధికారులు హెచ్చరించారు. వలలను తీరానికి దూరంగా తరలించిన మత్స్యకారులు

Published : 05 Dec 2021 06:04 IST

పూడిమడక తీరంలో జాగారం

పూడిమడకలో తాళ్లతో కట్టి ఉంచిన పడవలు

వెంకటనగరం తీరంలో కోతకు గురైన సముద్రపు గట్టు

భీమిలి సహాయక కేంద్రంలో వసతులు పరిశీలిస్తున్న జేసీ వేణుగోపాల్‌రెడ్డి

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: హుద్‌హుద్‌ తుపాను అనుభవాలను గుర్తుకు తెచ్చుకుని పూడిమడక మత్స్యకారులు శనివారం కూడా ఆందోళనగానే ఉన్నారు. తుపాను ప్రభావం తొలగిపోలేదని రెవెన్యూ, పోలీసు అధికారులు హెచ్చరించారు. వలలను తీరానికి దూరంగా తరలించిన మత్స్యకారులు అలల తాకిడికి కొట్టుకుపోకుండా పడవలను చెట్లకు కట్టి తీరంలోనే జాగారం చేశారు.

విశాఖపట్నం, న్యూస్‌టుడే: తుపాను హెచ్చరికలు కొనసాగుతుండడంతో జిల్లా వ్యాప్తంగా ప్రకటించిన హైఅలర్ట్‌ కొనసాగుతోంది. ఆదివారం ఉదయం నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తుపాను కేంద్రం హెచ్చరికలు జారీ చేయడంతో అంతటా అప్రమత్తత చర్యలు కొనసాగిస్తున్నారు. మూడు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు గాజువాక, మధురవాడ, కైలాసగిరి కేంద్రంగా, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం నగరంలో సేవలందిస్తున్నాయి. తీర గ్రామాలు, లోతట్టు, ముంపు ప్రభావిత ప్రాంతాల్లో 89 సహాయక శిబిరాలు అందుబాటులోకి తెచ్చారు. ఆయా సహాయక కేంద్రాల్లో 60 వేల మంది వరకు తలదాచుకొనేందుకు ఏర్పాట్లు చేశారు. ముప్పు తొలగే వరకు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఎ.మల్లికార్జున, జిల్లా ప్రత్యేక అధికారి జె.శ్యామలరావు సిబ్బందిని ఆదేశించారు. జేసీ వేణుగోపాల్‌ రెడ్డి భీమిలిలో పర్యటించారు.

ఎగసిపడిన భారీ అలలు

పాయకరావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: తుపాన్‌ కారణంగా తీరంలో భారీగా అలలు ఎగసి పడ్డాయి. వెంకటనగరం, కొర్లయ్యపేట తీరాల్లో భారీగా కెరటాలు ఒడ్డుకు చొచ్చుకురావడంతో గట్లు కోతకు గురయ్యాయి. ముందస్తు హెచ్చరికలతో పెంటకోట, గజపతినగరం, పాల్మన్‌పేట, రత్నాయంపేట, వెంకటనగరం తదితర గ్రామాల మత్స్యకారులు బోట్లు ఒడ్డుకు చేర్చి ఇళ్లకు పరిమితమయ్యారు. శ్రీరాంపురం, కేశవరం, సత్యవరం, మంగవరం, గోపాటపట్నం, నామవరం, గుంటపల్లి తదితర గ్రామాల్లో రైతులు పంటలు కోత చేసి కుప్ప నూర్పులు చేస్తున్నారు. తహసీల్దార్‌ కార్యాలయం కంట్రోల్‌ రూంలో ఎప్పటికప్పుడూ సమాచారం తెలుసుకుంటున్నారు.


ప్రాంతం వర్షపాతం (మి.మీ.)

భీమునిపట్నం 15.8

కొయ్యూరు 2.2

విశాఖపట్నం రూరల్‌ 2.0

అనంతగిరి 1.6

అరకులోయ 0.8

పాడేరు 0.6

ముంచంగిపుట్టు 0.6

పెదబయలు 0.4


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని