logo

బ్రాండిక్స్‌ను ప్రారంభించింది రోశయ్యే!

ఆసియాలోనే అతిపెద్ద టెక్స్‌టైల్స్‌ పార్కు బ్రాండిక్స్‌ అపెరల్‌ సిటీని ముఖ్యమంత్రి హోదాలో కె.రోశయ్య 2010 మే మూడున ప్రారంభించారు. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో శ్రీలంకకు చెందిన బ్రాండిక్స్‌కి స్థానిక సెజ్‌లో వెయ్యి ఎకరాల స్థలాన్ని కేటాయించారు.

Published : 05 Dec 2021 06:04 IST

నాటి సీఎం రోశయ్యని సన్మానిస్తున్న బ్రాండిక్స్‌ ఛైర్మన్‌ అష్రఫ్‌ఒమర్‌ (దాచిన చిత్రం)

●●అచ్యుతాపురం, న్యూస్‌టుడే: ఆసియాలోనే అతిపెద్ద టెక్స్‌టైల్స్‌ పార్కు బ్రాండిక్స్‌ అపెరల్‌ సిటీని ముఖ్యమంత్రి హోదాలో కె.రోశయ్య 2010 మే మూడున ప్రారంభించారు. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో శ్రీలంకకు చెందిన బ్రాండిక్స్‌కి స్థానిక సెజ్‌లో వెయ్యి ఎకరాల స్థలాన్ని కేటాయించారు. 60 వేల మందికి ఉపాధి కల్పిస్తామని కంపెనీ యాజమాన్యం ప్రభుత్వానికి తెలియజేసింది. 2005లో స్థలాన్ని తీసుకున్న బ్రాండిక్స్‌ 2008లో ఉత్పత్తులు ప్రారంభించింది. పార్కు పూర్తిస్థాయిలో సిద్ధం కావడంతో రోశయ్య ముఖ్య అతిథిగా హాజరై బ్రాండిక్స్‌ను ప్రారంభించారు. తమ కంపెనీని ప్రారంభించిన నేత మృతిచెందడంతో బ్రాండిక్స్‌తో అనుబంధం ఉన్న ఉద్యోగులు, ప్రస్తుతం పనిచేస్తున్న వేలాది మంది విచారం వ్యక్తం చేశారు. ఆయన చేతులమీదుగా ప్రారంభమైన బ్రాండిక్స్‌ ఉపాధి అందించే ఒక దేవాలయంగా మారడం గొప్ప విషయమని కంపెనీ భారతీయ భాగస్వామి దొరస్వామి పేర్కొన్నారు. సంస్థ ఛైర్మన్‌ అష్రఫ్‌ఒమర్‌, ఉద్యోగుల తరఫున రోశయ్య ఆత్మకు, కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని దొరస్వామి తెలిపారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని