logo
Published : 06/12/2021 02:14 IST

పర్యాటకులతో రద్దీగా బొజ్జన్నకొండ

కొండ వద్ద సందర్శకుల ఆటపాటలు

అనకాపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: శంకరం బొజ్జన్నకొండ ఆదివారం కార్తిక మాసం చివరిరోజు కావడంతో పర్యాటకులతో రద్దీగా మారింది. జిల్లా నలుమూలల నుంచి భారీగా కొండకు తరలివచ్చారు. విద్యార్థులు పాఠశాల బస్సుల్లో ప్రత్యేకంగా వచ్చారు. బౌద్ధ స్తూపాలను, బుద్ధుని విగ్రహాలను పర్యాటకులు తిలకించారు. కొండ విశిష్టతను విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరించారు. కొండ దిగువ భాగంలో ఉన్న వనాల వద్ద ఆటపాటలతో సందడి చేశారు.  కొండ అందాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొండ సిబ్బంది, పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ఎస్‌.రాయవరం: రేవుపోలవరం తీరానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు ఇక్కడి కొబ్బరి తోటలు, మాధవ స్వామి ఆలయం, కొండపై శివపార్వతుల విగ్రహాలు వంటి ఆహ్లాదకర ప్రాంతాలను సందర్శించారు. సాయంత్రం పలువురు సముద్ర స్నానాలు చేశారు.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని