logo

ధారాలమ్మ ఘాట్‌ రోడ్డులో దోపిడీ యత్నం

ఘాట్‌రోడ్డులో మరోసారి దొంగలు హల్‌చల్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాహనం ఆదివారం ఉదయం లంబసింగి వెళ్తుండగా ధారాలమ్మ ఘాట్‌ రోడ్లో అడ్డంగా రాళ్లు పెట్టి వాహనాన్ని నిలువరించడానికి ప్రయత్నం

Published : 06 Dec 2021 02:14 IST

రహదారికి అడ్డంగా పెట్టిన రాళ్లు

సీలేరు, న్యూస్‌టుడే: ఘాట్‌రోడ్డులో మరోసారి దొంగలు హల్‌చల్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాహనం ఆదివారం ఉదయం లంబసింగి వెళ్తుండగా ధారాలమ్మ ఘాట్‌ రోడ్లో అడ్డంగా రాళ్లు పెట్టి వాహనాన్ని నిలువరించడానికి ప్రయత్నం చేశారు. డ్రైవర్‌ ముందుగానే పసిగట్టి రాళ్లు మీద నుంచి వాహనాన్ని పోనిచ్చారు. దీంతో దొంగలు వెంబడించి రాళ్లు విసరడంతో కారు అద్దాలు పగిలిపోయాయి. పర్యటకులు వాహనాన్ని ఆపకుండా సప్పర్ల వెళ్లి విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. వెంటనే స్పందించిన పోలీసులు ధారకొండ నుంచి యువకుల బృందాన్ని సంఘటనా స్థలానికి పంపించారు. సుమారు 20 మంది అక్కడకు చేరుకుని గాలింపు చర్యలు నిర్వహించారు. దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. అనుమానితులు ఎవరూ కనిపించకపోవడంతో రహదారికి అడ్డంగా ఉన్న రాళ్లు తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేశారు. సంఘటనాస్థలంలో కత్తిని యువకులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై విచారణ చేస్తున్నామని సీఐ అశోక్‌కుమార్‌ తెలిపారు.

ఘటనా స్థలంలో దొరికిన కత్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని