logo

రైతుల పాదయాత్రకు ఆటంకమా..?: మాజీ మంత్రి

అమరావతి రైతులు శాంతియుతంగా పాదయాత్ర చేస్తూ..ఏడుకొండల వాడి దర్శనానికి వెళ్తున్నారు. అందుకే ఆయా ప్రాంతాల్లోని ప్రజలు వారికి స్వాగతం పలుకుతున్నారు. అలాంటి రైతుల పాదయాత్రకు ఆటంకం కల్పించడం..

Published : 06 Dec 2021 02:48 IST

కప్పస్తంభం వద్ద పూజలు చేస్తున్న బండారు దంపతులు

సింహాచలం, న్యూస్‌టుడే: అమరావతి రైతులు శాంతియుతంగా పాదయాత్ర చేస్తూ..ఏడుకొండల వాడి దర్శనానికి వెళ్తున్నారు. అందుకే ఆయా ప్రాంతాల్లోని ప్రజలు వారికి స్వాగతం పలుకుతున్నారు. అలాంటి రైతుల పాదయాత్రకు ఆటంకం కల్పించడం.. మూర్ఖత్వమా..? అహంభావమా..? తేల్చుకోవాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన సతీసమేతంగా సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రైతు లేనిదే రాజ్యం, అన్నం లేవన్నారు. రైతులు ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేస్తే  స్వాగతిస్తానని, నియోజకవర్గంలో ఖర్చులు భరిస్తానన్నారు. పంచగ్రామాల భూసమస్యను పరిష్కరించకుండా 20వేల కుటుంబాలతో ప్రభుత్వం ఆటలాడుతోందన్నారు. అనంతరం స్వామిని దర్శించుకుని, కుమారుడు అప్పలనాయుడు వివాహ శుభలేఖను సమర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని