logo

అలవాట్లతో ఆయుష్షు పెంచుకోవచ్చు

మనుషులు అరవే ఏళ్ల నాటి జీవన విధానాన్ని తిరిగి అనుసరిస్తే వందేళ్లు జీవించవచ్చని అనువంశిక ప్రకృతి వైద్యుడు డాక్టర్‌ రవివర్మ అన్నారు. ఎంవీపీకాలనీ ఆళ్వార్‌దాస్‌ మైదానంలో ఆంధ్రప్రదేశ్‌ గోఆధారిత ప్రకృతి

Published : 06 Dec 2021 02:48 IST

ప్రకృతి వైద్యుడు డాక్టర్‌ రవివర్మను సత్కరిస్తున్న సీఎంఆర్‌ సంస్థల అధినేత మావూరి వెంకటరమణ, నిర్వాహకులు

మద్దిలపాలెం, న్యూస్‌టుడే : మనుషులు అరవే ఏళ్ల నాటి జీవన విధానాన్ని తిరిగి అనుసరిస్తే వందేళ్లు జీవించవచ్చని అనువంశిక ప్రకృతి వైద్యుడు డాక్టర్‌ రవివర్మ అన్నారు. ఎంవీపీకాలనీ ఆళ్వార్‌దాస్‌ మైదానంలో ఆంధ్రప్రదేశ్‌ గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఆర్గానిక్‌ మేళాలో చివరి రోజైన ఆదివారం ‘ఆరోగ్యమే..మహాభాగ్యం’ పేరిట సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న డాక్టర్‌ రవివర్మ మాట్లాడుతూ.. మనిషి ఆహార అలవాట్లు మారడం వల్ల ఆయుష్షు 60 ఏళ్లకు తగ్గిపోయిందన్నారు. పూర్వకాలంలో మాదిరిగా ఆహారపు అలవాట్లు చేసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చన్నారు. చెప్పులు లేకుండా మట్టిలోకి రావడం వల్ల మోకాళ్ల నొప్పుల నుంచి బయటపడవచ్చన్నారు. ఈ ఆహారపు అలవాట్లు ఇలాగే కొనసాగితే ఆయువ సగటు 30 సంవత్సరాలకు పడిపోతుందన్నారు.

భారతీయ జీవన విధానమే అన్ని సమస్యలకు పరిష్కారమని సీఎంఆర్‌ సంస్థల అధినేత మావూరి వెంకటరమణ అన్నారు. సేంద్రియ పద్ధతిలో పండించిన పంటలను తినడం వల్ల రోగాల నుంచి దూరంకావచ్చన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌, మేళా కమటీ అధ్యక్షుడు పీఎల్‌ఎన్‌.రాజు, నిర్వాహకులు ఎం.యుగంధర్‌రెడ్డి, పి.రామకృష్ణ, వి.షణ్ముఖరావు, జేవీ రత్నం, కుమారిస్వామి, ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌, భాజపా నగర ఉపాధ్యక్షుడు సురేష్‌బాబు, మెడిసినల్‌ ప్లాంట్స్‌ పరిశోధకుడు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని