logo
Published : 06/12/2021 02:48 IST

వ్యక్తి ఆత్మహత్య

గురుద్వారా, న్యూస్‌టుడే: ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ద్వారకాజోన్‌ పోలీసులు తెలిపిన వివరాలిలా... ఎం.సతీశ్‌కుమార్‌(39) అనే వ్యక్తి విజయవాడ నుంచి వచ్చి శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో అశీలుమెట్టలోని ఓ లాడ్జిలో దిగాడు. ఆ సమయంలో పేరు, ఫోన్‌ నెంబరు మాత్రమే చెప్పి ఆధార్‌కార్డు  ఉదయం ఇస్తానన్నాడు. ఆదివారం సాయంత్రం వరకు బయటకు రాకపోవడంతో లాడ్జి సిబ్బంది తలుపు కొట్టారు. స్పందన లేకపోవడంతో ద్వారకాజోన్‌ పోలీసులకు సమాచారం అందించారు. వారు తలుపు కొట్టి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గొలగాని అప్పారావు పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 94409 04332, 63051 87009 నంబర్లకు సమాచారం అందించాలని సీఐ కోరారు.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని