logo

ముందంజలో గ్రాండ్‌మాస్టర్‌ లక్ష్మణ్‌

అఖిల భారత ఓపెన్‌ ఫిడే ర్యాంకింగ్‌ చదరంగం పోటీలు రెండో రోజు ఆదివారం నగరంలో స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో ఉత్సాహంగా కొనసాగాయి. రెండో రౌండ్‌ పోటీలను ఆదాయపన్నుశాఖ అధికారి ఎం.వి.ఎన్‌.ఎస్‌.భావనారాయణ

Published : 06 Dec 2021 02:48 IST

ఉత్సాహంగా అఖిలభారత ‘ఫిడే’ చదరంగం పోటీలు

ఎంపికైన క్రీడాకారులతో సునీల్‌మహంతి తదితరులు

విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే: అఖిల భారత ఓపెన్‌ ఫిడే ర్యాంకింగ్‌ చదరంగం పోటీలు రెండో రోజు ఆదివారం నగరంలో స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో ఉత్సాహంగా కొనసాగాయి. రెండో రౌండ్‌ పోటీలను ఆదాయపన్నుశాఖ అధికారి ఎం.వి.ఎన్‌.ఎస్‌.భావనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు నువ్వా,నేనా అంటూ తలపడ్డారు. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ పోరాట పటిమ కనబరిచారు. మూడో రౌండ్‌ పోటీలు ముగిసే సమయానికి గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌.ఆర్‌.లక్ష్మణ్‌, ఇంటర్నేషనల్‌ మాస్టర్స్‌ హిమాల్‌ గుస్సేన్‌, కృష్ణతేజ సహా 27మంది క్రీడాకారులు మూడు పాయింట్లతో ముందంజలో కొనసాగుతున్నారు. ఆంధ్రా చదరంగం సంఘం అధ్యక్షుడు కె.వి.వి.శర్మ, కార్యదర్శి భీమారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని