logo
Updated : 20 Dec 2021 11:20 IST

AP News: విస్తరిస్తున్న విశాఖ

సొంతింటి కల సాకారానికి అనువైన ప్రాంతం

- ఈనాడు, విశాఖపట్నం

శరవేగంగా విస్తరిస్తున్న విశాఖపట్నం అన్నివర్గాలను ఆకట్టుకుంటోంది. నగరం నలువైపులా అభివృద్ధి జరగడంతో నిర్మాణం రంగం ఊపందుకుంది. నగరంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని ప్రతిఒక్కరూ కలలుకంటారు. ముఖ్యంగా ఆకట్టుకునే సహజ వనరులు, ఎత్తయిన కొండలు, సువిశాల సముద్ర తీరం, మరెన్నో పర్యాటక ప్రాంతాలు ఉండడంతో ఈ ప్రాంతానికి ప్రాధాన్యం పెరుగుతోంది. అన్నిచోట్ల గృహ నిర్మాణ ప్రాజెక్టులు వస్తున్నాయి.


నగరం నలువైపులా..

విశాఖ మెట్రోను విస్తరించడం, ఐటీ, పారిశ్రామిక నడవా, జాతీయ విద్యాలయాలు, పరిశోధన సంస్థల ఏర్పాటుతో నగర పరిధి పెరిగింది. ఇటు తగరపువలస నుంచి అటు అనకాపల్లి, భీమునిపట్నం, పెందుర్తి, కొత్తవలస, సుజాతనగర్‌, ఆనందపురం, మధురవాడ, ఎండాడ, గాజువాక, పరవాడ, సబ్బవరం, భోగాపురం, ఇతర ప్రాంతాలు త్వరితంగా పట్టణీకరణకు నోచుకుంటున్నాయి. దీంతో అక్కడ భారీ ప్రాజెక్టులు సైతం వస్తున్నాయి. ధరలు కొండెక్కుతున్న ప్రస్తుత తరుణంలో సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే వారికి ఇదే సరైన సమయం. మెటీరియళ్ల ధరలు, పన్నులు ఇతరాలు పెరిగేలోపే సమకూర్చుకుంటే మంచిది. సుమారు 75 స్టాళ్లతో 250 ప్రాజెక్టుల వరకు ఈ ఎక్స్‌పోలో ప్రదర్శనకు రానున్నాయి. ఇందులో వినియోగదారుల డిమాండ్‌ ఆధారంగా అన్నివర్గాలకు అందుబాటు ధరల్లో కొనుగోలు స్థాయికి వీలుగా ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయి. నచ్చినవి ఒకే వేదిక వద్ద ఎంపిక చేసుకోవచ్చు.

- వి.శ్రీనివాస్‌, ఎక్స్‌పో కన్వీనర్‌


సమయం ఆదా..

విశాఖకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉండడంతో సొంతింటి కలను సాకారం చేసుకోవాలని చాలామంది చూస్తారు. పెట్టుబడి కోసమైనా ఎక్కువమంది ప్రయత్నిస్తారు. అటువంటి వారి సమయం వృథా అవ్వకుండా వారి అభిరుచులకు తగిన ఇంటిని ఒకే వేదిక మీద ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నాం. ముఖ్యంగా క్రెడాయ్‌ అంటే నాణ్యతా, సమయానికి ప్రాజెక్టు అప్పగిస్తామనే నమ్మకంతోనే వినియోగదారులు ఆదరిస్తున్నారు. ఇక్కడి వారే కాకుండా తెలంగాణ, ఒడిశా ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడ ఇళ్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నెల 24, 25, 26 తేదీల్లో గతానికి భిన్నంగా కొనుగోలుదారులకు లాభదాయకం కలిగేలా గాదిరాజు ప్యాలెస్‌లో క్రెడాయ్‌ స్థిరాస్తి ప్రదర్శన నిర్వహిస్తున్నాం. దీనికి ‘ఈనాడు-ఈటీవీ మీడియా పార్టనర్‌గా వ్యవహరిస్తున్నాయి.

- బి.శ్రీనివాసరావు, క్రెడాయ్‌ ఛైర్మన్‌


డిమాండు నెలకొనడంతో..

విశాఖలో అంతర్జాతీయ ప్రమాణాలు, నూతన సాంకేతిక విధానాలతో పలు కొత్త గృహ నిర్మాణ ప్రాజెక్టులు వస్తున్నాయి. వీటిని ఒకే వేదిక మీద చూసేందుకు నగర ప్రజలకు అవకాశం కలిగింది. ఎంతో ప్రత్యేకత కలిగిన నమ్మకమైన స్థిరాస్తులు ఇక్కడ చూడొచ్ఛు ప్రదర్శన మూడు రోజులూ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సందర్శకులకు అసౌకర్యం కలగకుండా సువిశాల ప్రాంగణాల్లో వీటిని ఏర్పాటు చేశాం.

- కేఎస్‌ఆర్‌కే రాజు, క్రెడాయ్‌ ప్రెసిడెంట్‌


ప్రత్యేక రాయితీలు

స్థిరాస్తి ప్రదర్శనలో కొనుగోలు చేసే వారికి ప్రత్యేక రాయితీలు ఉండనున్నాయి. ఆయా బ్యాంకులు గృహ నిర్మాణాలపై వడ్డీ రాయితీ ఇవ్వనున్నాయి. ఫ్లాట్లు కొనుగోలు చేసే వారికి బిల్డర్లు వారి సామర్థ్యం ఆధారంగా చదరపు అడుగుకి రూ.100 నుంచి రూ.500 వరకు ప్రత్యేకంగా తగ్గించనున్నారు. ఇవేకాకుండా సందర్శకులకు ఆకర్షణీయ బహుమతులున్నాయి. రోజూ పది బంగారు నాణాలు, చివరి రోజు లక్కీ డ్రా విజేతకు ఒక విద్యుత్తు స్కూటర్‌ అందజేస్తాం. వీటితో పాటు విజ్ఞానదాయకంగా ఉండేలా స్మార్ట్‌ సిటీ, మాస్టర్‌ప్లాన్‌ వంటి అంశాలపై సంబంధిత నిపుణులతో చర్చాగోష్ఠి నిర్వహిస్తాం.

- ఇ.అశోక్‌, సెక్రటరీ, క్రెడాయ్‌

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని