logo

AP News: సుప్రీంకోర్టు న్యాయవాది.. మతిస్థిమితం లేకుండా ఆర్కే బీచ్‌లో..

సుప్రీంకోర్టు న్యాయవాది రమాదేవిని విశాఖపట్నం బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు నరసింగరావు, ఇతర న్యాయవాదులు శనివారం కలిసి, ఆమె పరిస్థితిపై ఆరా తీశారు. వారం రోజులుగా ఆర్కేబీచ్‌లో సంచరిస్తున్న ఆమెను

Updated : 26 Dec 2021 11:00 IST

 

ఆశ్రయ కేంద్రంలో రమాదేవి  

విశాఖ కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: సుప్రీంకోర్టు న్యాయవాది రమాదేవిని విశాఖపట్నం బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు నరసింగరావు, ఇతర న్యాయవాదులు శనివారం కలిసి, ఆమె పరిస్థితిపై ఆరా తీశారు. వారం రోజులుగా ఆర్కేబీచ్‌లో సంచరిస్తున్న ఆమెను పోలీసులు ఆరా తీయగా, తాను సుప్రీంకోర్టు న్యాయవాదినని చెప్పి గుర్తింపు కార్డు చూపారు. మతిస్థిమితం సరిగా లేని ఆమెను టీఎస్సార్‌ కాంప్లెక్స్‌లోని ఆశ్రయ కేంద్రానికి తరలించారు. బయటకు వెళ్లిపోతానని శుక్రవారం గొడవ చేసిన ఆమె శనివారం ఎలాంటి హడావుడి లేకుండా కేంద్రంలోనే ఉన్నారు. రమాదేవి పరిస్థితిని సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌కు తెలియజేస్తామని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌ శర్మ తెలిపారు. తెలుగు, ఆంగ్లం, హిందీ మాట్లాడుతున్న ఆమె తనకు భర్త, కుమారుడు ఉన్నారని చెబుతున్నారు. అయితే ఎక్కడ ఉంటారనే విషయాన్ని స్పష్టం చేయలేపోతున్నారని ఆశ్రయ కేంద్రం నిర్వాహకులు జ్యోతిర్మయి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని