logo

మాటలే ..చేతలేవి?

రోడ్డు ప్రమాదాలు... ఘటనల్లో తీవ్రత తగ్గించేందుకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిర్వహించే రహదారి భద్రత కమిటీ (ఆర్‌.ఎస్‌.సి.)సమావేశాల్లో తీసుకునే నిర్ణయాల అమలు అరకొరగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అందులో ప్రతిపాదనలు ఎప్పటికి సాకారం అవుతాయన్న అంశం అంతుపట్టని రీతిలో ఉంది.

Published : 15 Jan 2022 05:03 IST

అమలుకు నోచని ‘రహదారి భద్రత కమిటీ’ సూచనలు

ఆర్‌ఎస్‌సీలో కొన్ని ప్రధాన నిర్ణయాల పరిస్థితి ఇదీ..

ఈనాడు, విశాఖపట్నం: రోడ్డు ప్రమాదాలు... ఘటనల్లో తీవ్రత తగ్గించేందుకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిర్వహించే రహదారి భద్రత కమిటీ (ఆర్‌.ఎస్‌.సి.)సమావేశాల్లో తీసుకునే నిర్ణయాల అమలు అరకొరగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అందులో ప్రతిపాదనలు ఎప్పటికి సాకారం అవుతాయన్న అంశం అంతుపట్టని రీతిలో ఉంది. మరో వైపు నగరంలో జరుగుతున్న ప్రమాదాలు మాత్రం కలవరం రేపుతున్నాయి. ఉన్న 67 బ్లాక్‌స్పాట్లు ప్రమాదహేతువులుగా మారుతున్నాయి.

*● నగరంలోని జాతీయ రహదారికి ఇరువైపులా సర్వీసు రహదారిని నిర్మించాలని నిర్ణయించారు.ప్రభుత్వ భూములు ఉన్నచోట్ల కూడా నిర్మించలేదు. ● అడవివరం-గోశాల రహదారి విస్తరణ చేయాలనుకున్నా అమలుకు నోచుకోలేదు. ● ట్రాఫిక్‌ రద్దీ తీవ్రంగా ఉన్నచోట్ల మల్టీలెవల్‌ కార్‌పార్కింగ్‌లను నిర్మించాలని తీర్మానించారు. జగదాంబ దగ్గర నిర్మించినది అధికారికంగా ప్రారంభించినా ప్రజలకు అందుబాటులోకి తేలేదు. ● షీలానగర్‌ నుంచి సబ్బవరం వరకు పోర్టు అనుసంధాన రహదారికి రెవెన్యూ అధికారులు భూసేకరణ సకాలంలో చేయకపోవడంతో నిర్మాణ సంస్థ అధికారులకు నోటీసులిచ్చి పనుల నుంచి వైదొలిగింది. ● ప్రధాన రహదారుల్లో విద్యుద్దీపాలు వెలగకపోతే వెంటనే మరమ్మతు చేయాలని నిర్ణయం తీసుకున్నా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. ● నగరంలోని జాతీయ రహదారిపై 12 పైవంతెనలు నిర్మించాలని నిర్ణయించారు. ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి చేరింది. అధికారిక ఆమోదం లభించలేదు.● బీచ్‌రోడ్డులో రుషికొండ పరిసర ప్రాంతాల్లో విద్యుద్దీపాలు మరింత కాంతివంతంగా ఉండేలా చర్యలు చేపట్టాలని భావించారు. అది పూర్తికాలేదు.

*● పి.ఎం.పాలెం స్టేడియం నుంచి కొమ్మాది వరకు, గోపాలపట్నం నుంచి పెందుర్తి వరకు రహదారి మధ్య రోడ్డుదాటకుండా గ్రిల్స్‌ నిర్మాణం పనులు కూడా మొదలుకాలేదు.

వీటికి మోక్షం: ● వడ్లపూడి కూడ లిని అభివృద్ధి చేశారు. ● కార్‌షెడ్‌ జంక్షన్‌ను కొంత ముందుకు మార్చారు. కానీ, కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి.● కొమ్మాది కూడలిని అభివృద్ధి చేశారు. ● చంద్రంపాలెం పాఠశాల వద్ద పాదచారులు రోడ్డుదాటడానికి సిగ్నల్‌ వ్యవస్థ వచ్చింది.


భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం..

నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా పలు చర్యలు తీసుకుంటున్నాం. ఏ సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు చూపాలన్న అంశంపై అధికారులతో కలిసి పలు నిర్ణయాలు తీసుకున్నాం. అమలుకు కృషి చేస్తున్నాం. మిగిలిన వాటిపైనా దృష్టి సారిస్తాం’ అని ఆర్‌ఎస్‌సీ ఛైర్మన్‌, ఎంపీ సత్య నారాయణ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని