logo

‘రఘురామాపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి’

పోలీసు అధికారులపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అనుచిత వాఖ్యలు చేశారంటూ, ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వివిధ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

Published : 15 Jan 2022 05:03 IST
సబ్‌ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మణరావుకు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

నర్సీపట్నం, న్యూస్‌టుడే: పోలీసు అధికారులపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అనుచిత వాఖ్యలు చేశారంటూ, ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వివిధ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు స్థానిక సబ్‌ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మణరావుకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. విధి నిర్వహణలో భాగంగా విచారణకు హాజరు కావాలని కోరిన సీఐడీ అధికారులపై ఎంపీ వ్యక్తిగత దూషణకు పాల్పడడం దారుణమన్నారు. బహుజన ఐక్య వేదిక నాయకుడు బొట్టా నాగరాజు, అంబేడ్కర్‌ ఇండియా మిషన్‌ నాయకుడు సాల్మన్‌ రాజు, స్వేరో ప్రతినిధి కె.గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు