logo

క్షణాల్లో కరోనా టీకా ధ్రువపత్రం

ప్రస్తుత కరోనా సమయంలో ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాలన్నా.. విమానం ఎక్కి ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్నా.. అక్కడ ముందుకు మనకి ఎదురయ్యే ప్రశ్న? మీరు కొవిడ్‌ టీకా వేయించుకున్నారా.. అయితే ఆ ధ్రువపత్రం చూపించండి అని అడుగుతుంటారు.

Published : 15 Jan 2022 05:29 IST

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే: ప్రస్తుత కరోనా సమయంలో ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాలన్నా.. విమానం ఎక్కి ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్నా.. అక్కడ ముందుకు మనకి ఎదురయ్యే ప్రశ్న? మీరు కొవిడ్‌ టీకా వేయించుకున్నారా.. అయితే ఆ ధ్రువపత్రం చూపించండి అని అడుగుతుంటారు. అటువంటప్పుడు మనం ఎక్కడో దూరంగా ఉన్న ఇంటర్నెట్‌ సెంటర్లకు పరుగులు తీస్తాం.. ఒక్కొక్కసారి మన ఆధార్‌ వెంట తీసుకెళ్లడం మరచిపోవడం, లేదంటే మనం టీకా వేసుకున్నప్పుడు వచ్చిన మెసేజ్‌లు ఉండకపోవడం జరుగుతుంది. ఇవేమీ అవసరం లేకుండా మన ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ఉండి అందులో వాట్సాప్‌ ఉంటే చాలు.. మనం నిల్చున్న చోటే క్షణంలో మనం టీకా వేసుకున్నట్లు ధ్రువపత్రం వస్తుంది.

● మన సెల్‌ఫోన్‌లో 9013151515 నంబరును సేవ్‌ చేసుకోవాలి. తర్వాత వాట్సాప్‌లో ఆ నంబరులోకి వెళ్లి certificate అని టైప్‌ చేసి ఆ మెసేజ్‌ని పంపాలి. వెంటనే మన ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఆ నంబరును వాట్సాప్‌లో పంపిస్తే ఎప్పుడు కరోనా టీకా వేయించుకున్న వివరాలు తెలుపుతూ ధ్రువపత్రం పీడీఎఫ్‌ రూపంలో వస్తుంది. టీకా వేయించుకున్న సమయంలో వైద్య సిబ్బందికి ఇచ్చిన నంబరుకు వాట్సాప్‌ ఉంటేనే ఈ సదుపాయం వినియోగించుకోవచ్ఛు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని