logo

locked house monitoring system: ఇంటికి దొంగలొస్తే..

న్యూస్‌టుడే, ఎంవీపీకాలనీ: పండగ సెలవులకు ఊరు వెళ్తున్నారా...? ఇంట్లో విలువైన వస్తువులను ఉంచారా?.. అయితే ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్ధు.. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా పెట్టుకొని దొంగతనాలు చేసే ముఠాలు, దొంగలు విశాఖ కమిషనరేట్‌ పరిధిలో సంచరిస్తున్నారు.

Updated : 15 Jan 2022 07:51 IST

ఎల్‌హెచ్‌ఎంఎస్‌తో రక్షణ కల్పిస్తామంటున్న పోలీసులు

సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న పోలీసు అధికారి

పట్టిస్తుంది!

న్యూస్‌టుడే, ఎంవీపీకాలనీ: పండగ సెలవులకు ఊరు వెళ్తున్నారా...? ఇంట్లో విలువైన వస్తువులను ఉంచారా?.. అయితే ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్ధు.. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా పెట్టుకొని దొంగతనాలు చేసే ముఠాలు, దొంగలు విశాఖ కమిషనరేట్‌ పరిధిలో సంచరిస్తున్నారు. ఏ మాత్రం అవకాశం చిక్కినా, ఇంట్లో విలువైన వస్తువులతో ఉడాయిస్తున్నారు. ఈ తరహా దొంగతనాల నుంచి రక్షణ పొందేందుకు ఎల్‌హెచ్‌ఎంఎస్‌ (లాక్డ్‌ హౌస్‌ మానటరింగ్‌ సిస్టమ్‌)ను ఉపయోగించు కోవాలంటూ క్రైమ్‌ పోలీసులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఎల్‌హెచ్‌ఎంఎస్‌ను ఉపయోగించుకుంటే మీ ఇంటికి మాది భద్రత అని పోలీసులు హామీ ఇస్తున్నారు.


ఎల్‌హెచ్‌ఎంఎస్‌ రిక్వస్టులు

సద్వినియోగం చేసుకోవాలి..

ఎల్‌హెచ్‌ఎంఎస్‌ వ్యవస్థ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. నేరాలు జరగకుండా ముందు జాగ్రత్తగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. నగరంలో చాలా మందికి దీనిపై సరైన అవగాహన లేదు. అందుకే ఇటీవల పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఇది పూర్తిగా ఉచితమనే విషయాన్ని గ్రహించాలి. నగర పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఎల్‌హెచ్‌ఎంఎస్‌ కింద 186 కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. ఇంటి దొంగతనాలను నియంత్రించేందుకు వీలుగా తాళాలు వేసిన ఇళ్లపై కూడా నిఘా ఉంచుతున్నాం.


ఊరు వెళ్లే ముందు చెబితే చాలు...

లాక్డ్‌హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఎల్‌హెచ్‌ఎంఎస్‌) సదుపాయం పొందాలనుకునేవారు ముందుగా తమ చరవాణిల్లో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. యాప్‌లో పేరు, ఫోన్‌ నెంబరు వివరాలతో రిజిస్టర్‌ కావాలి. ఇంటికి తాళం వేసి ఊరు వెళ్తున్న సమయంలో యాప్‌ ద్వారా రిక్వస్టులో సూచించిన విధంగా సమాచారం అందించాలి. దీనికి సంబంధించిన సిబ్బంది వెంటనే రిక్వస్టు పెట్టిన వారి ఇంటికి వచ్చి ఎవరికి కనిపించని ప్రదేశంలో రహస్య కెమెరాను అమరుస్తారు. ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించేందుకు మోడమ్‌ను ఏర్పాటు చేస్తారు.

-పెంటారావు, ఏసీపీ(క్రైమ్‌)


● ఎల్‌హెచ్‌ఎంఎస్‌ యాప్‌ లేకపోయినా సంబంధిత స్టేషన్‌లో ఈ వ్యవస్థ కావాలని కోరిన వెంటనే నేర విభాగం అధికారులు వెంటనే స్పందిస్తారు. కెమెరాలు అందుబాటులో లేకపోయినా నిరంతర నిఘా ఉంచటానికి వీలుంటుంది. ● ఎల్‌హెచ్‌ఎంఎస్‌ కింద కెమెరాను అమర్చిన ఇంటిపై పోలీసుల నిఘా కూడా ఉంటుంది. ఇంట్లో అమర్చిన కెమెరా పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానమై ఉంటుంది. ఆ ఇంట్లోకి ఎవరైనా ప్రవేశిస్తే ఇంట్లో అమర్చిన వ్యవస్థ ద్వారా కంట్రోల్‌ రూమ్‌లో అలారం మోగుతుంది. దీంతో పోలీసులు దొంగతనం జరగకుండా చర్యలు తీసుకుంటారు. ● ఎల్‌హెచ్‌ఎంఎస్‌ యాప్‌ను ఉపయోగించే కెమెరాకు కదలికలను గమనించే ప్రత్యేక సాంకేతిక వ్యవస్థను కలిగి ఉంటుంది. ఇంట్లో కదలికలపై 5 క్షణాల్లో కంట్రోల్‌ రూమ్‌లో అలారం మోగుతుంది. యాప్‌ ద్వారా రిజిస్టర్‌ అయిన ఇంటి యజమాని ఫోన్‌కు కూడా హెచ్చరిక వెళ్తుంది. వెంటనే అప్రమత్తమవటానికి ఆస్కారం ఉంటుంది. కెమెరా అమర్చిన ఇంటిని పోలీసులు తరచూ గమనిస్తూ ఉంటారు.


పోలీసు కమిషనరేట్‌ పరిధిలో పోలీసుస్టేషన్లు: 23

అందుబాటులో ఉన్న ఎల్‌హెచ్‌ఎంఎస్‌ కెమెరాలు: 186

ఎల్‌హెచ్‌ఎంఎస్‌లో రిజిస్టర్‌ అయిన

ఇంటి యజమానులు: 55,239

2019 1187

2020 335

2021 253


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని