logo

ఆక్సిజన్‌ వినియోగంపై నిరంతర పర్యవేక్షణ: జేసీ

కొవిడ్‌ మూడో దశ నేపథ్యంలో జిల్లాలోని ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ కొరత రానీయ కూడదని జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో జేసీ మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఆక్సిజన్‌ సరఫరా నిరంతరాయంగా

Published : 18 Jan 2022 05:58 IST

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: కొవిడ్‌ మూడో దశ నేపథ్యంలో జిల్లాలోని ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ కొరత రానీయ కూడదని జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో జేసీ మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఆక్సిజన్‌ సరఫరా నిరంతరాయంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, ఎల్‌ఎంఓలు, డిటైపు సిలిండర్లు అవసరాల మేరకు సిద్ధంగా ఉన్నాయని, వాటిని రీఫిల్లింగ్‌ చేసే సమయంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు. ప్రతి కొవిడ్‌ ఆసుపత్రిలో సుశిక్షితులైన బృందాలను అందుబాటులో ఉంచాలన్నారు. ఆయా బృందాలు ఆక్సిజన్‌ వాడకాన్ని పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో ఆక్సిజన్‌ ఉత్పత్తి, అవసరాలు, రవాణా తదితర విషయాలను ఎప్పటికప్పుడు పరిశీలించి నిర్ణయాలు తీసుకొనేందుకు జిల్లా స్థాయి అధికారులతో కూడిన వార్‌రూమ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. జేసీ ఆధ్వర్యంలో పనిచేసే ఈ వార్‌రూమ్‌లో డీటీసీ, అదనపు పోలీసు సూపరింటెండెంట్‌, పరిశ్రమలశాఖ జీఎం, డ్రగ్‌ కంట్రోలు సహాయ సంచాలకులు, డీసీహెచ్‌ఎస్‌, ఐఎంఏ జిల్లా అధ్యక్షులు సభ్యులుగా ఉంటారన్నారు. ఆయా శాఖల అధికారులు రామలింగరాజు, డాక్టర్‌ విజయలక్ష్మి, డాక్టర్‌ లక్ష్మణరావు, పెంచల కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని