logo

బారిజం సందడి

గిరిజన సంప్రదాయ బారిజంతో పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది. మూడేళ్లకోసారి సంక్రాంతి తర్వాత వచ్చే బారిజంకు గిరి పల్లెలు ప్రాధాన్యమిస్తాయి. బారిజం పేరుతో గ్రామ దేవత సన్నిధిలో

Published : 18 Jan 2022 06:13 IST

కత్తులతో లింగాపుట్టు గ్రామస్థుల ప్రదర్శన

పాడేరు/పట్టణం, న్యూస్‌టుడే: గిరిజన సంప్రదాయ బారిజంతో పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది. మూడేళ్లకోసారి సంక్రాంతి తర్వాత వచ్చే బారిజంకు గిరి పల్లెలు ప్రాధాన్యమిస్తాయి. బారిజం పేరుతో గ్రామ దేవత సన్నిధిలో ఉంచిన పురాతన ఆయుధాలను శుద్ధి చేసే వేడుక విభిన్నంగా నిర్వహిస్తారు.. ఈ క్రమంలో లింగాపుట్టు గ్రామ చావడిలో సోమవారం ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. గ్రామస్థులంతా ఒక చోట చేరి ఆయుధాలను గ్రామంలో ఊరేగించారు. కత్తులతో చేపట్టిన విన్యాసాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. స్థానిక యువత విచిత్ర వేషధారణలతో సందడి చేశారు. ట్రైకార్‌ ఛైర్మన్‌ బుల్లిబాబు, జడ్పీటీసీ సభ్యురాలు గాయత్రీదేవి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని