logo

ఈ పిల్లాడికి ఉజ్జోగం ఉందంట!

‘ఎనిమిదో తరగతి చదువుతున్న మా అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడంటూ రేషన్‌ కార్డు తొలగించారు. భర్త లేని నాకు వితంతు పింఛను నిలిపివేశారు. ఆర్థిక ఇబ్బందులతో పస్తులుంటున్నా’మని బలిఘట్టం ప్రాంతానికి చెందిన ఎం.నాగరత్నం ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

Published : 18 Jan 2022 06:13 IST

రేషన్‌, పింఛను రద్దుతో పస్తులు


కుమారుడితో నాగరత్నం

నర్సీపట్నం, న్యూస్‌టుడే: ‘ఎనిమిదో తరగతి చదువుతున్న మా అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడంటూ రేషన్‌ కార్డు తొలగించారు. భర్త లేని నాకు వితంతు పింఛను నిలిపివేశారు. ఆర్థిక ఇబ్బందులతో పస్తులుంటున్నా’మని బలిఘట్టం ప్రాంతానికి చెందిన ఎం.నాగరత్నం ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పాత ఇనుము సామగ్రి విక్రయించే ఆమె భర్త మద్యానికి బానిసై ఐదేళ్ల కిందట మరణించాడు. అప్పట్నుంచి ఆమె వితంతు పింఛనుపై ఆధారపడి బతుకు బండి ఈడుస్తోంది. కుమారుడు పవన్‌కుమార్‌(14), కుమార్తె మోనికదేవి (16)ని వేములపూడి ఆదర్శ పాఠశాలలో చదివిస్తున్నారు. ఎనిమిది నెలల కిందట రేషను కార్డు, పింఛను రద్దు కావడంతో గ్రామ సచివాలయానికి వెళ్లి ఆరా తీశారు. మీ అబ్బాయి పవన్‌కుమార్‌కు ఉద్యోగం ఉన్నందున రేషన్‌, పింఛను రద్దయినట్లు ఆన్‌లైన్‌లో చూపుతోందని సిబ్బంది చెప్పారు. వివరాలు తప్పుగా నమోదు కావడంతో ఆమె కుటుంబమంతా అవస్థలు పడుతున్నారు. ఈ విషయాన్ని డివిజనల్‌ సహాయ పౌరసరఫరాల అధికారి సత్యనారాయణరాజు దృష్టికి తీసుకువెళ్లగా.. ఆ అబ్బాయి వివరాలను విజయవాడలోని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ కార్యాలయంలో సరిచేయాల్సి ఉందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని