logo

మిన్నంటిన నిరసన

ఉద్యోగులకు నష్టం కలిగించేలా ఉన్న పీఆర్సీ జీవోలను తక్షణం రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మంగళవారం నిరసన గళం వినిపించాయి. ఏపీఎన్జీవోల పిలుపు మేరకు అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలను ధరించిన నిరసన తెలిపారు.

Published : 19 Jan 2022 04:46 IST

 పీఆర్సీ జీవోలపై ఉద్యోగుల ఆగ్రహం

  20న కలెక్టరేట్‌ ముట్టడికి నిర్ణయం

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం


గాజువాక: నడుపూరు హైస్కూలు వద్ద నినదిస్తూ...
 
ఉద్యోగులకు నష్టం కలిగించేలా ఉన్న పీఆర్సీ జీవోలను తక్షణం రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మంగళవారం నిరసన గళం వినిపించాయి. ఏపీఎన్జీవోల పిలుపు మేరకు అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలను ధరించిన నిరసన తెలిపారు.
జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలను ధరించి పీఆర్సీ జీవో ప్రతులను దహనం చేశారు. ఎలమంచిలి, గాజువాక, హనుమంతువాక, పెందుర్తి, భీమిలి, వంటిచోట్ల రోడ్లపైకి ర్యాలీగా వచ్చి ఆందోళనలు చేశారు. ప్రభుత్వం అర్థరాత్రి విడుదల చేసిన జీవోలను ఉపసంహరించుకోవాలని, అందరికీ ఆమోదయోగ్యమైన పీఆర్సీని ప్రకటించాలని నినాదాలు చేశారు.

● ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ప్యాప్టో) ఆధ్వర్యంలో తోటగరవు ఉన్నత పాఠశాలలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు, టీచర్లు సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈనెల 20న (గురువారం) ఉద్యోగ, ఉపాధ్యాయులంతా కలెక్టరేట్‌ను ముట్టడించాలని పిలుపునిచ్చారు

జీవీఎంసీ సమీప గాంధీ విగ్రహం వద్ద ఆందోళనలో ఉపాధ్యాయులు

* ● వేల మంది ఉపాధ్యాయులు 20న కలెక్టరేట్‌ ముట్టడిలో పాల్గొని విజయవంతం చేయాలని ప్యాప్టో ప్రధాన కార్యదర్శి ధర్మేందర్‌ రెడ్డి కోరారు. రివర్స్‌ పీఆర్సీ జారీచేసి ఉద్యోగుల జీతాల్లో కోతలు పెట్టారని, పెన్షనర్లను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ యూటీఎప్‌ జిల్లా అధ్యక్షుడు గొంది చిన్నబ్బాయి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పీఆర్సీ పేరుతో చర్చలకు పిలిచి సంఘాలను మాట్లాడనీయకుండా ఏకపక్షంగా జీవోలను విడుదల చేసిన తీరు అప్రజాస్వామికమన్నారు. అడ్డగోలుగా జారీచేసిన జీవోల వల్ల ఉద్యోగులంతా ఎన్నో రకాలుగా నష్టపోతున్నారని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు దేముడుబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌ ముట్టడిని జయప్రదం చేయాలని కోరారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని