logo

ప్రధాన రహదారులు..మూసివేస్తాం

కొవిడ్‌ ఉద్ధృతి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం నుంచి రాత్రి కర్ఫ్యూ పకడ్బందీగా అమలు జరుగుతుందని నగర పోలీసు కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా వెల్లడించారు.

Published : 19 Jan 2022 04:46 IST

మంగళవారం రాత్రి నుంచి కర్ఫ్యూ అమలు: సీపీ


మాట్లాడుతున్న సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా, చిత్రంలో డీసీపీ గౌతమి సాలి

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే: కొవిడ్‌ ఉద్ధృతి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం నుంచి రాత్రి కర్ఫ్యూ పకడ్బందీగా అమలు జరుగుతుందని నగర పోలీసు కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా వెల్లడించారు.

*● మంగళవారం సాయంత్రం ఆర్కేబీచ్‌ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ గౌతమి సాలితో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు జరుతుందన్నారు. ఈ సమయంలో ప్రధాన *రహదారులను మూసివేస్తామన్నారు. అత్యవసర సేవలు, ఇతర రాష్ట్రాలకు చెందిన రవాణా వాహనాలు, రాత్రి సమయంలో ప్రయాణించే ఆర్టీసీ బస్సులకు మాత్రమే అనుమతులు ఉంటాయన్నారు.

*● బీఆర్‌టీఎస్‌, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ రహదారులను బారికేడ్లతో మూసివేస్తారన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రయాణికులను పరిశీలించి పంపిస్తామని.. వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. వారాంతపు సెలవుల్లో బీచ్‌రోడ్డుల్లో ప్రవేశాలు, ఇతర ఆంక్షలపై సమీక్షిస్తామన్నారు.

*● రాత్రి 10 గంటల నుంచే బీచ్‌రోడ్డులో ప్రవేశాలు ఉండవన్నారు. కర్ఫ్యూ సమయంలో ఆంక్షలు ధిక్కరించిన వారిపై కేసులు తప్పవన్నారు. పగలు కూడా మాస్క్‌ ధరించని వారికి జరిమానా విధిస్తామన్నారు.

● * కమిషనరేట్‌ పరిధిలో పనిచేస్తున్న పోలీసు సిబ్బందికి రెండో డోసు వేసి 9 నెలలు పూర్తయితే బూస్టర్‌ డోస్‌ వేస్తున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని