logo

ఉపరాష్ట్రపతి పర్యటనలో స్వల్ప మార్పులు

ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడి విశాఖ పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. కృష్ణా జిల్లా పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి బుధవారం ఉదయం 6గంటలకు ప్రత్యేక రైలులో బయలుదేరి మధ్యాహ్నం 12.30గంటలకు విశాఖ చేరుకోనున్నారు.

Published : 19 Jan 2022 04:46 IST

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడి విశాఖ పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. కృష్ణా జిల్లా పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి బుధవారం ఉదయం 6గంటలకు ప్రత్యేక రైలులో బయలుదేరి మధ్యాహ్నం 12.30గంటలకు విశాఖ చేరుకోనున్నారు. స్వాగత కార్యక్రమాల తర్వాత నేరుగా పోర్టు అతిథి గృహానికి వెళతారు. అక్కడ ఈనెల 21 వరకు బస చేయనున్నారు. 22న తిరుగు ప్రయాణం కానున్నారు. ఉపరాష్ట్రపతికి ప్రభుత్వం తరఫున రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖల మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు స్వాగతం పలకనున్నారు. జిల్లాకు చెందిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కొవిడ్‌ కారణంగా హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. దీంతో స్వాగత బాధ్యతలను శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి అప్పలరాజుకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు రైల్వేస్టేషన్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్డీఓ పెంచలకిషోర్‌ ఆయా ఏర్పాట్లను మంగళవారం పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని