logo

‘హెచ్‌పీసీఎల్‌’ పనితీరుకు ప్రశంస

కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలోని ‘పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌’ విభాగం దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో నిర్ణీత ప్రామాణికాలను పరిశీలించి 2020-21 ఏడాదికి ప్రతిభా స్కోరును ఖరారు చేసింది

Published : 19 Jan 2022 04:46 IST

ఈనాడు, విశాఖపట్నం, ఉక్కునగరం(గాజువాక): కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలోని ‘పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌’ విభాగం దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో నిర్ణీత ప్రామాణికాలను పరిశీలించి 2020-21 ఏడాదికి ప్రతిభా స్కోరును ఖరారు చేసింది. దాని ఆధారంగా ఆ సంస్థలు ఏ విభాగాల్లో ఉన్నాయన్న విషయాన్ని మంగళవారం ప్రకటించింది. ‘పూర్‌’, ‘ఫెయిర్‌’, ‘గుడ్‌’, ‘వెరీగుడ్‌’, ‘ఎక్స్‌లెంట్‌’ కేటగిరీలు పేర్కొనగా.. అందులో నగరంలోని హెచ్‌.పి.సి.ఎల్‌ 95.53 స్కోరుతో ‘ఎక్స్‌లెంట్‌’ కేటగిరీ సాధించింది. విశాఖ ఉక్కు 57.28తో గుడ్‌, భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌(52.53) ‘గుడ్‌’, హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ 35.94 స్కోరుతో ‘ఫెయిర్‌’ కేటగిరీని సాధించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని