logo

రెండేళ్ల తరువాత వినియోగంలోకి మొదటి యూనిట్‌

రెండేళ్ల తరువాత సీలేరు జలవిద్యుత్కేంద్రంలో మొదటి యూనిట్‌ వినియోగంలోకి వచ్చింది. సీలేరు జలవిద్యుత్కేంద్రంలో 60 మెగావాట్ల సామర్థ్యం గల మొదటి యూనిట్‌ 2019 డిసెంబరులో రోటార్‌ ఎర్త్‌ సమస్యతో మరమ్మతులకు

Published : 19 Jan 2022 05:11 IST

సీలేరు, న్యూస్‌టుడే: రెండేళ్ల తరువాత సీలేరు జలవిద్యుత్కేంద్రంలో మొదటి యూనిట్‌ వినియోగంలోకి వచ్చింది. సీలేరు జలవిద్యుత్కేంద్రంలో 60 మెగావాట్ల సామర్థ్యం గల మొదటి యూనిట్‌ 2019 డిసెంబరులో రోటార్‌ ఎర్త్‌ సమస్యతో మరమ్మతులకు గురైంది. దీంతో ఈ పనులను ఒక ప్రైవేటు ఇంజినీరింగ్‌ కంపెనీకి కాంప్లెక్స్‌ అధికారులు అప్పగించారు. సీఈగా బాధ్యతలు స్వీకరించిన వి.రాంబాబు సీలేరులో మకాం వేసి యూనిట్‌ మరమ్మతులపై ప్రత్యేక శద్ధ పెట్టారు. మంగళవారం రాత్రికి అన్ని మరమ్మతులు పూర్తిచేసి విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఈ వి.రాంబాబు ఇంజినీర్లు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని