logo

హాల్‌టిక్కెట్లు అందక డిప్లొమో విద్యార్థుల ఆందోళన

పరీక్షలకు సంబంధించిన ఓఎంఆర్‌ షీట్లు బుధవారం ప్రభుత్వ కెమికల్‌ పాలిటెక్నిక్‌ కళాశాలకు రానున్నాయని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కె.వి.రమణ తెలిపారు. జిల్లా మొత్తం అన్ని కళాశాలలకు సంబంధించిన షీట్లు ఇక్కడ కళాశాలకు వస్తాయన్నారు

Published : 19 Jan 2022 05:23 IST

నేటి నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్న ప్రిన్సిపాల్‌

నేడు ఓఎంఆర్‌ షీట్ల రాక..: పరీక్షలకు సంబంధించిన ఓఎంఆర్‌ షీట్లు బుధవారం ప్రభుత్వ కెమికల్‌ పాలిటెక్నిక్‌ కళాశాలకు రానున్నాయని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కె.వి.రమణ తెలిపారు. జిల్లా మొత్తం అన్ని కళాశాలలకు సంబంధించిన షీట్లు ఇక్కడ కళాశాలకు వస్తాయన్నారు.

కంచరపాలెం, న్యూస్‌టుడే: పాలిటెక్నిక్‌ డిప్లొమో విద్యార్థులకు హాల్‌టిక్కెట్లు అందక పోవడంతో ఆవేదన చెందుతున్నారు. అయిదో సెమిస్టరు పరీక్షలు ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్నాయి. కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, మెటలర్జీ బ్రాంచ్‌లు ఉండగా, ప్రభుత్వ కెమికల్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో కెమికల్‌కు సంబంధించిన బ్రాంచ్‌లు ఉన్నాయి. జిల్లాలో ఎనిమిది ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలుండగా, పద్దెనిమిది ప్రయివేటు పాలిటెక్నిక్‌ కళాశాలలు, నాలుగు ఇంజినీరింగ్‌ కళాశాలలో సెకెండ్‌ షిప్ట్‌లలో పాలిటెక్నిక్‌ కళాశాలలు నడుస్తున్నాయి. ఆయా కళాశాలలో వేలాది మంది విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. ఇదే విషయమై ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ జి.వి.వి. సత్యనారాయణ మూర్తిని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా హాల్‌టిక్కెట్లు బుధవారం నుంచి ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. కళాశాలలోనూ అందజేస్తార న్నారు. ఎక్కడ చదువుతున్నారో అక్కడే పరీక్షలు జరగనుండడంతో హాల్‌టిక్కెట్ల విషయంలో ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని