logo

సోనోవిజన్‌ లక్కీ డ్రా విజేతలు వీరే..

సంక్రాంతి పండగకి వైజాగ్‌ సోనోవిజన్‌ డిస్కౌంట్‌ సేల్‌ సందర్భంగా కొనుగోలుదారులకు లక్కీ డ్రా నిర్వహించారు. డైమండ్‌ పార్కు పక్కనున్న సోన్‌విజన్‌లో మంగళవారం రాత్రి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ లక్కీ డ్రా తీసి విజేతల్ని ప్రకటించారు. విజేతలు వీరే

Published : 19 Jan 2022 05:28 IST

కూపన్లు తీసి విజేతల్ని ప్రకటిస్తున్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే: సంక్రాంతి పండగకి వైజాగ్‌ సోనోవిజన్‌ డిస్కౌంట్‌ సేల్‌ సందర్భంగా కొనుగోలుదారులకు లక్కీ డ్రా నిర్వహించారు. డైమండ్‌ పార్కు పక్కనున్న సోన్‌విజన్‌లో మంగళవారం రాత్రి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ లక్కీ డ్రా తీసి విజేతల్ని ప్రకటించారు. విజేతలు వీరే.. మొదటి బహుమతిగా హోండా అమేజి కారును దుర్గానగర్‌కు చెందిన బొడ్డు చంద్రలక్ష్మి గెలుపొందగా, ద్వితీయ బహుమతి ఎల్‌.ఇ.డి. టి.వి.ని ఎస్‌.కోటకు చెందిన పి.మణి, తృతీయ బహుమతి రిఫ్రిజిరేటర్‌ను కప్పరాడ దరి బాపూజీనగర్‌కు చెందిన పి.నాని, నాలుగో బహుమతిగా రామభద్రపురానికి చెందిన బి.ఎస్‌.సుందరరావు వాషింగ్‌మిషన్‌ను గెలుపొందారు. ఈ సందర్భంగా సోనోవిజన్‌ షోరూం మేనేజింగ్‌ పార్టనర్‌ పి.భాస్కరమూర్తి మాట్లాడుతూ అందరికన్న తక్కువ ధరలు, నమ్మకమైన సర్వీస్‌లు అందించే అతిపెద్ద ఎలాక్ట్రానిక్‌ షోరూం తమదని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని